జస్ప్రిత్ బుమ్రాకు రెస్ట్... మొహమ్మద్ సిరాజ్‌కు ఛాన్స్ !

జస్ప్రిత్ బుమ్రాకు రెస్ట్... మొహమ్మద్ సిరాజ్‌కు ఛాన్స్ !

Updated: Jan 8, 2019, 12:24 PM IST
జస్ప్రిత్ బుమ్రాకు రెస్ట్... మొహమ్మద్ సిరాజ్‌కు ఛాన్స్ !
Image Credits: Twitter/@BCCI

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆసిస్ బ్యాట్య్‌మేన్ వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రిత్ బుమ్రాకు ఆసిస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌తోపాటు ఆ తర్వాత న్యూజీలాండ్‌తో ఆడనున్న టీ20 సిరీస్‌కి సైతం విశ్రాంతి కల్పిస్తున్నట్టు బీసీసీఐ స్పష్టంచేసింది. ఆసిస్‌తో వన్డే సిరీస్‌తోపాటు న్యూజీలాండ్‌తో తలపడనున్న జట్టుకుగాను బుమ్రా స్థానంలో మొహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. అంతేకాకుండా న్యూజీలాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడనున్న భారత జట్టులోకి సిద్ధార్థ్ కౌల్‌ని ఎంపిక చేసినట్టు బీసీసీఐ పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ ఓ ట్వీట్ చేసింది.