Jasprit Bumrah: టీమిండియాకు ఎదురుదెబ్బ.. స్వదేశానికి వచ్చేసిన బుమ్రా

Jasprit Bumrah Returns Home: జస్ప్రీత్ బుమ్రా శ్రీలంక నుంచి ముంబైకి తిరిగి వచ్చేశాడు. ఆసియా కప్‌లో రేపు నేపాల్‌తో టీమిండియా మ్యాచ్‌ ఆడనుండగా.. బుమ్రా సడెన్‌గా స్వదేశానికి రావడం షాక్‌కు గురిచేస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే బుమ్రా వచ్చినట్లు తెలుస్తోంది.

Written by - Ashok Krindinti | Last Updated : Sep 3, 2023, 10:17 PM IST
Jasprit Bumrah: టీమిండియాకు ఎదురుదెబ్బ.. స్వదేశానికి వచ్చేసిన బుమ్రా

Jasprit Bumrah Returns Home: ఆసియా కప్‌లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంక నుంచి ముంబైకి తిరిగి వచ్చేశాడు. ఆసియా కప్ ఆడుతున్న బుమ్రా.. వ్యక్తిగత కారణాలతోనే భారత్‌కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా వెల్లడించలేదు. అయితే బుమ్రా హఠాత్తుగా జట్టుకు దూరమవ్వడం పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఐర్లాండ్‌పై టీ20 సిరీస్‌తో బుమ్రా తన బౌలింగ్‌లో ఇంకా పదును తగ్గలేదని నిరూపించుకున్నాడు. ప్రపంచకప్‌కు ముందు ఆసియా కప్‌ను గెలుచుకుని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని భావిస్తున్న తరుణంలో బుమ్రా విషయం ఆందోళన కలిగిస్తోంది.

శనివారం భారత్, పాకిస్థాన్ జట్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 266 పరుగులకు ఆలౌట్ అయింది. చివర్లో బుమ్రా 16 పరుగులు చేసి జట్టు స్కోరు 250 దాటేలా చేశాడు. వర్షం కారణంగా బుమ్రాకు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. సోమవారం నేపాల్‌తో టీమిండియా ఆడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే భారత్ సూపర్‌-4 అడుగుపెడుతోంది. ఈ మ్యాచ్‌కు బుమ్రా దూరమైనా పెద్ద ఇబ్బంది ఉండదు గానీ.. తరువాత జరిగే సూపర్-4 మ్యాచ్‌లకు కూడా దూరమైతే టీమిండియాకు కష్టాలు తప్పవు.

జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దాదాపు ఏడాదిపాటు మైదానానికి దూరంగా ఉన్నాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్, టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఆడలేకపోయాడు. బెంగుళూరులోని ఎన్‌సీఏలో ట్రీట్‌మెంట్ తీసుకున్న బుమ్రా.. పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గానూ ఎంపికై జట్టును ముందుండి నడిపించాడు.

రెండు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాన్‌ ఆఫ్ ద సిరీస్‌గాను కూడా గెలుచుకున్నాడు. బుమ్రా లేని టీమిండియా పేస్ దళం బలహీనంగా మారుతుంది. అయితే ఐర్లాండ్ నుంచి నేరుగా శ్రీలంక వెళ్లిన బుమ్రాకు నేపాల్‌తో మ్యాచ్‌కు బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చినట్లు తెలుస్తోంది. సూపర్-4 మ్యాచ్‌ల నాటికి జట్టుతో చేరే అవకాశం ఉంది. బుమ్రా స్థానంలో మహ్మద్ షమీ తుది జట్టులోకి రానున్నాడు. పాక్‌తో బెంచ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే.

Also Read: PM Kisan Latest Updates: పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలర్ట్.. ఈ మూడు పనులు కచ్చితంగా చేయండి   

 Also Read: Best Breakfast Foods: మీ శరీరంలో ఇమ్యూనిటీని వేగంగా పెంచే 6 అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News