కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ గా అశ్విన్

టీమిండియా క్రికెటర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని కెప్టెన్సీ వరించింది.

Last Updated : Feb 26, 2018, 04:53 PM IST
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ గా అశ్విన్

టీమిండియా క్రికెటర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని కెప్టెన్సీ వరించింది. ఐపీఎల్ 11వ సీజన్ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్‌గా అశ్విన్‌ని నియమిస్తున్నట్లు జట్టు యాజమాన్యం వెల్లడించింది. గతకొద్ది రోజులుగా ఫాంలో లేనందున టీం ఇండియాకి దూరంగా ఉంటున్న రవిచంద్రన్ అశ్విన్‌ను ఈ పదవి వరించింది. ఈ ఏప్రిల్ 7 నుంచి  ఐపీఎల్ 11వ సీజన్ మొదలుకానుంది.  

గత సీజన్‌లలో చెన్నై సూపర్ కింగ్స్, పుణె సూపర్ జెయింట్స్ జట్టు తరఫున అశ్విన్ ఆడాడు. ఈ ఏడాది జరిగిన వేలంలో చెన్నై జట్టు అశ్విన్‌ను తమ జట్టులోకి తీసుకోవడంలో మొగ్గు చూపలేదు. దీంతో పంజాబ్ జట్టు అశ్విన్‌ను రూ.7.6 కోట్లు పెట్టి కొనేసింది. అంతేకాక జట్టు మెంటర్ వీరేంద్ర సెహ్వాగ్ సలహా మేరకు అశ్విన్‌కి జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు  తమ ఫేస్‌బుక్ పేజీ ద్వారా ప్రకటించింది. గతంలో పంజాబ్ జట్టుకు యువరాజ్, సంగక్కర, గిల్ క్రిస్ట్, మురళీ విజయ్ తదితరులు కెప్టెన్ లుగా బాధ్యతలు చేపట్టారు.

Trending News