KL Rahul Dismiss Usman Khawaja with Extraordinary One-Handed Catch: 20 సంవత్సరాల క్రితంతో పోల్చితే.. భారత జట్టు ఫీల్డింగ్ బాగా మెరుగైంది. ప్రస్తుత జట్టులోని ప్రతిఒక్కరు అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తున్నారు. రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ మాత్రమే కాదు.. రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ కూడా మైదానంలో చురుగ్గా కదులుతూ క్లిష్టతరమైన క్యాచ్‌లను సైతం పడుతున్నారు. బ్యాటర్ నుంచి బౌలర్ వరకూ ఎందరో ఎలాంటి బెరుకు లేకుండా బంతిని అడ్డుకుంటున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు.
కేఎల్ రాహుల్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా సమయానుసారంగా ఆడుతుంటాడు. అయితే కీపర్ అయిన రాహుల్.. ఫీల్డింగ్‌లో మాత్రం చురుగ్గా ఉండడనే అపవాదు ఉంది. ఆ అపవాదును భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్ ద్వారా చెరిపేసుకున్నాడు.ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టి విమర్శకుల నోటికి తాళం వేశాడు. ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా ఈ క్యాచ్ చూసి షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రవీంద్ర జడేజా వేసిన 45వ ఓవర్ ఐదవ బంతిని రివర్స్ స్వీప్ కొట్టేందుకు ఉస్మాన్ ఖవాజా ప్రయత్నించాడు. బ్యాటుకు బాగా కనెక్ట్ అయిన బంతి ఆఫ్ సైడ్ వైపు దూసుకెళినది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్.. తన కుడి వైపునకు గాల్లో ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ పట్టాడు. ఇది చూసిన ఖవాజా షాక్‌కు గురై కాసేపు క్రీజ్‌లో మోకాలిపైనే కూర్చుండిపోయాడు. మరోవైపు కామెంటేటర్లు సైతం వాట్ ఏ క్యాచ్ అంటూ పొగిడేశారు. అద్భుత క్యాచ్ పట్టిన రాహుల్‌ను సహచరులు అభినందించారు. రాహుల్ సూపర్ క్యాచ్ వీడియోను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.
ICYMI - WHAT. A. CATCH 😯😯
WOW. A one-handed stunner from @klrahul to end Usman Khawaja’s enterprising stay!#INDvAUS pic.twitter.com/ODnHQ2BPIK
— BCCI (@BCCI) February 17, 2023
ఆస్ట్రేలియాతో అజరిగిన తొలి టెస్టులో విఫలమైనప్పటికీ.. ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ తుది జట్టులో కేఎల్ రాహుల్ చోటు దక్కించుకోగలిగాడు. నాగ్‌పూర్ టెస్టులో 20 పరుగులే చేశాడు. 70 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ బాదాడు. ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను కాదని ఫామ్ లేమితో సతమతమవుతున్న రాహుల్‌ను ఎందుకు తీసుకున్నారని మేనేజ్‌మెంట్‌పై భారత ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇక రాహుల్‌కు రెండో టెస్టు జట్టులో చోటు దక్కదనుకున్నారు. అయితే టీం మేనేజ్‌మెంట్ అతడిపై నమ్మకం ఉంచింది. రెండో టెస్టులో ఎలా రాణిస్తాడో చూడాలి.
Also Read: జస్ట్ మిస్.. బ్లాక్ కింగ్ కోబ్రా కాటు నుంచి స్నేక్ క్యాచర్ ఎస్కేప్! డేంజరస్ వీడియో
Also Read: పాత ఇంట్లో 16 అడుగుల కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపింది! చివరకు ఏమైందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.