IPL 2024: పదేళ్ల తరువాత క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన మాజీ స్టార్ ప్లేయర్

Navjot Singh Sidhu IPL 2024: టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యాతగా మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. రేపు చెన్నై, ఆర్‌సీబీ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో కామెంట్రీ ఇవ్వనున్నాడు. ఇటీవల రాజకీయాలపై పూర్తి దృష్టి కేంద్రీకరించిన సిద్దూ.. మళ్లీ కామెంటెటర్‌ పాత్రలో కనిపించనున్నాడు.  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 21, 2024, 05:06 PM IST
IPL 2024: పదేళ్ల తరువాత క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన మాజీ స్టార్ ప్లేయర్

Navjot Singh Sidhu IPL 2024: ఐపీఎల్ 2024 వేటకు రంగం సిద్ధమవుతోంది. క్రికెట్ అభిమానులకు మరింత వినోదాన్ని అందించేందుకు ఐపీఎల్ వచ్చేస్తోంది. శుక్రవారం చెన్నైలోని ఎం.చిదంబరం స్టేడియం వేదిక మెగా టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఐదుసార్లు ట్రోఫీతో చెన్నై సమరోత్సాహంతో రెడీ అవ్వగా.. ఈ సీజన్‌లో అయినా కప్ ముద్దాడాలని ఆర్‌సీబీ బిగ్ ఫైట్‌కు సై అంటోంది. ధోని ఇదే చివరి సీజన్ అయ్యే అవకాశం ఉండడంతో కప్‌తో ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని చెన్నై ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక దాదాపు పదేళ్ల తరువాత భారత మాజీ సూపర్ స్టార్ మళ్లీ ఐపీఎల్ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. రేపు తన గొంతుతో అలరించనున్నారు.

Also Read: Holidays: ప్రజలకు అలర్ట్‌.. మూడు రోజులు వరుసగా బ్యాంకులు బంద్‌.. స్టాక్‌ మార్కెట్లు కూడా

మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ దశాబ్దం తర్వాత తన కామెంట్రీతో అలరించనున్నాడు. కవితలతో క్రికెల్ అభిమానుల దృష్టిని ఆకర్షించే నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. మరోసారి అదే జోష్‌తో తన కామెంట్రీతో షేక్ చేయనున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్‌లో మళ్లీ తన వ్యాఖ్యానం ద్వారా మ్యాజిక్ చేయనున్నాడు. శుక్రవారం ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌లో సిద్దూ కామెంటెటర్‌గా వ్యవహరించనున్నాడు. 

దాదాపు పదేళ్లపాటు కామెంట్రీకి దూరంగా ఉన్న సిద్దూ.. 2019 వరకు కపిల్ శర్మ షోలో కనిపించాడు. వివాదం తర్వాత ఆ షో నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించారు. అయితే ఇప్పుడు మళ్లీ కామెంట్రీ మొదలుపెట్టనున్నాడు. 60 ఏళ్ల సిద్ధూ భారత క్రికెట్ వ్యాఖ్యాతలలో ఒకరుగా ఉన్నారు. ఇంటర్నెషనల్ మ్యాచ్‌లకు కామెంట్రీ అందించడంతోపాటు.. ఐపీఎల్‌లో ప్రసారకర్తల కోసం కూడా వర్క్ చేశాడు. 2001లో భారత్‌లో శ్రీలంక పర్యటన సందర్భంగా ఈ మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ కామెంటెటర్‌గా ఎంట్రీ ఇచ్చాడు.  

"ఐపీఎల్ ప్రపంచకప్‌కు టోన్ సెట్ చేస్తుంది. ప్రపంచం మొత్తం దృష్టి ఐపీఎల్‌పైనే ఉంది. టీ20 వరల్డ్ కప్‌ టీమ్‌లో ఛాన్స్ కొట్టేందుకు ఇది మంచి అవకాశం. టీమిండియా ప్లేయర్లే కాకుండా.. విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్ సరైన వేదిక." అని సిద్దూ అన్నాడు. ఐపీఎల్‌లో మొత్తం పది జట్లు పాల్గొంటాయి. మార్చి 22 నుంచి మే 26 మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. 

Also Read: Summer Heat Stroke: దంచికొడుతున్న ఎండలు.. ఈ సింప్టమ్స్ కన్పిస్తే వడదెబ్బ తగిలినట్లే.. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News