సిరీస్ గెలుపు కోసం ఆఖరి మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్‌ని పిలిపించిన ఆసిస్

ఆఖరి మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్‌ని రంగంలోకి దింపిన ఆసిస్  

Updated: Nov 25, 2018, 06:50 PM IST
సిరీస్ గెలుపు కోసం ఆఖరి మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్‌ని పిలిపించిన ఆసిస్

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు భారత్‌తో తమ సొంత గడ్డ సిడ్నీ స్టేడియంలో చివరి మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టు.. ఎలాగైనా సరే సిరీస్‌ని సొంతం చేసుకోవాలని గట్టిగానే ప్రయత్నంచేస్తోంది. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న ఆసిస్ ఈ మ్యూచ్ కూడా గెలిస్తే, భారత్ ఇక టీ20 సిరీస్‌ని కోల్పోయినట్టే. అయితే, భారత్‌ని ఓడించి, సిరీస్‌ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న ఆసిస్ జట్టు.. తమ పథకంలో భాగంగా ఆఖరి మ్యాచ్ కోసం పేసర్ మిచెల్ స్టార్క్‌ని రంగంలోకి దింపింది. 2వ మ్యాచ్ కోసం శుక్రవారం జరిగిన వామప్ మ్యాచ్‌లో బిల్లీ స్టాన్‌లేక్ అరికాలి గాయం అవడంతో 3వ మ్యాచ్‌లో అతడి స్థానంలో మిచెల్ స్టార్క్‌కి అవకాశం లభించింది. 

మిచెల్ పర్ ఫార్మెన్స్ గురించి ఆసిస్ కెప్టేన్ ఎరోన్ ఫించ్ మాట్లాడుతూ.. లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్‌లో మిచెల్‌కి మంచి పట్టు సాధించాడని, టైమ్ రావాలే కానీ అతడు బంతితో ఓ ఆట ఆడుకుంటాడని అన్నాడు. మిచెల్ గత అనుభవమే అతడికి ఈ మ్యాచ్‌లో ఉపయోగపడుతుందని ఫించ్ ఆశాభావం వ్యక్తంచేశాడు.