Shami, Ashwin, Jadeja Bowling help Australia All-Out for 263 in IND vs AUS 2nd Test 2023: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఢిల్లీ వేదికగా నేడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్ట్ ఆరంభం అయిన విషయం తెలిసిందే. భారత బౌలర్లు చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 263 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (81), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (72 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరవగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (33) రాణించాడు. టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ నాలుగు వికెట్లు తీయగా.. స్పిన్నర్లు ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (15)ను మహ్మద్ షమీ అవుట్ చేసి తొలి వికెట్ పడగొట్టాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. మార్నస్ లబుషేన్ (18), స్టీవ్ స్మిత్ (0)లను అవుట్ చేశాడు. ట్రావిస్ హెడ్ (12) ను షమీ పెవిలియన్ చేర్చాడు. ఈ సమయంలో ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్‌కాంబ్ జట్టును ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు.
Innings Break!
Australia are all out for 263 in the first innings.
4️⃣ wickets for @MdShami11 👌🏻
3️⃣ wickets apiece for @ashwinravi99 & @imjadeja 👍🏻Scorecard ▶️ https://t.co/hQpFkyZGW8 #TeamIndia | #INDvAUS pic.twitter.com/RZvGJjsMvo
— BCCI (@BCCI) February 17, 2023
మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా స్పిన్ మాయాజాలం చేయడంతో ఆసీస్ కీలక ఉస్మాన్ ఖవాజా వికెట్ కోల్పోయింది. అలెక్స్ క్యారీ వికెట్ ఆర్ అశ్విన్ తీశాడు. ఓవైపు వికెట్స్ పడుతున్నా.. ఆరో స్థానంలో వచ్చిన హ్యాండ్స్‌కోంబ్ (72) అజేయ అర్ధ శతకంతో మెరిశాడు. అతడికి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (33) సహకరించాడు. దాంతో ఆసీస్ మెరుగైన స్కోరు చేసింది. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ ఆరంబించింది. రెండో టెస్టులోనూ పట్టు బిగించి ఆధిక్యాన్ని 2-0కు పెంచుకోవాలని పట్టుదలగా ఉంది.
Also Read: Vivo V27 Pro India Launch: వివో నుంచి సూపర్ క్యూట్ ఫోన్.. డిజైన్, ఫీచర్లు చూసి షాక్ అవుతున్న జనాలు!
Also Read; Budh Mahadasha 2023: 17 ఏళ్ల పాటు బుధ గ్రహ మహాదశ.. ఈ వ్యక్తులకు ఆనందం, శ్రేయస్సు! ధనవంతులు అవుతారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.