MS Dhoni and Suresh Raina spotted together at Lords: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో కానీ వెలుపల కానీ వీరి మధ్య అనుబంధం బాగుంటుంది. చాలా కాలం పాటు భారత జట్టుకు ఆడిన ధోనీ, రైనా.. ఒకేరోజు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ టోర్నీలో 2021 సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇద్దరు ప్రాతినిధ్యం వహించారు. మహీ ఇప్పటికీ చెన్నైలో కొనసాగుతుండగా.. రైనా మాత్రం 2022 సీజన్‌లో ఆడలేదు.
వ్యక్తిగత కారణాలతో యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020లో సురేష్ రైనా ఆడలేదు. అయితే కెప్టెన్ ఎంఎస్ ధోనీకి రైనాకు మధ్య విభేదాల కారణంగానే రైనా బయటకొచ్చాడనే వార్తలు అప్పట్లో సంచలనం రేపాయి. ఇక ఐపీఎల్ 2022 వేలంకు ముందు రైనాను చెన్నై వదిలేసుకుంది. మెగా వేలంలోనూ మిస్టర్ ఐపీఎల్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. బేస్ ప్రైస్‌కైనా చెన్నై కొనుగోలు చేస్తుందేమోనని అందరూ భావించినా.. అది జరగలేదు. దాంతో ధోనీ-రైనా మధ్య వివాదం నిజమేనని క్రికెట్ ఫాన్స్ అనుకున్నారు.
The Reunion of Brothers! 💛
THALA 🤝 thala! #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/ppLLVgZWRb— Chennai Super Kings (@ChennaiIPL) July 15, 2022
తమపై వచ్చిన రూమర్లకు ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా ఒక్క ఫొటోతో చెక్ పెట్టారు. గురువారం భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌ను ఇద్దరు కలిసి వీక్షించారు. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు ధోనీ-రైనా ఒకే కారులో వచ్చారు. మ్యాచ్ ఆసాంతం ఇద్దరు కలిసి స్టాండ్స్ లో ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విటర్‌లో పోస్టు చేసింది. 'మళ్లీ కలిసిన బ్రదర్స్. తలా, చిన్న తలా' అని కాప్షన్ రాసుకొచ్చింది. చాలా రోజుల తర్వాత వీరిద్దరూ పక్కపక్కన ఉండటంతో చెన్నై ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
7️⃣+ 3️⃣ = a complete 1️⃣0️⃣! 🥳💛#OnYourLeftCap #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/xc3jmPfGze
— Chennai Super Kings (@ChennaiIPL) July 14, 2022
Also Read: 9 ఏళ్లకు కనికరించిన సుస్మితా సేన్.. లలిత్ మోదీ ఓల్డ్ ట్వీట్ వైరల్! లేటు వయసులో ఘాటు ప్రేమ
Also Read: మరోసారి విరాట్ కోహ్లీ విఫలం.. అండగా నిలిచిన పాకిస్తాన్ కెప్టెన్! ఏమన్నాడంటే
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.