Ravi Shastri Praises MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni)పై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) ప్రశంసల వర్షం కురిపించారు. మహీ లాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదన్నారు. ధోనీ ఎంతో ప్రశాంతంగా ఉంటాడని, అతనిలో ఎప్పుడూ కోపంగా చూడలేదని తెలిపారు. భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ మైదానంలో దిగితే గెలుపే లక్ష్యంగా ఆడతాడని, అక్కడ దేనీ గురించీ పట్టించుకోడని రవిశాస్త్రి చెప్పారు. టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి స్వయంగా తప్పుకున్న విషయం తెలిసిందే.
తాజాగా పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) యూట్యూబ్ ఛానెల్లో రవిశాస్త్రి మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించారు. 'ఎంఎస్ ధోనీ అరుదైన ప్లేయర్. మ్యాచులో డకౌటైనా.. సెంచరీ చేసినా.. ప్రపంచకప్ గెలిచినా.. మెగా టోర్నీలో తొలి రౌండ్‌లోనే జట్టు వెనుదిరిగినా ఒకేలా ఉంటాడు. అన్నింటిని ఒకేలా చూస్తాడు. నేనెంతో మందిని చూశాను కానీ ధోనీ లాంటి ఆటగాడిని ఎక్కడా చూడలేదు. ఒక్కోసారి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు కూడా కోపం వచ్చేది. కానీ ధోనీకి మాత్రం ఎప్పుడూ రాదు' అని రవిశాస్త్రి అన్నారు.
'ఎంఎస్ ధోనీ మొబైల్ ఫోన్ వాడొద్దనుకుంటే అలాగే ఉండగలడు. తాను గ్యాడ్జెట్ పక్కన పెట్టాలనుకుంటే.. అలాగే పెట్టేస్తాడు. మీకు చెపితే నమ్మరు కానీ.. ఇప్పటికీ నా దగ్గర మహీ ఫోన్ నంబర్ (MSD Contact Number) లేదు. నేనెప్పుడూ తన నంబర్ కూడా అడగలేదు. తను అసలు ఫోన్ దగ్గర పెట్టుకోడని నాకు తెలుసు. అయితే అతడిని సంప్రదించాలనుకుంటే.. ఎలా కనెక్ట్ అవ్వొచ్చో నాకు బాగా తెలుసు. ధోనీ చాలా ప్రత్యేకమైన ఆటగాడు' అని రవిశాస్త్రి చెప్పారు. రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్ వచ్చిన విషయం తెలిసిందే.
ఇటీవల జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli)పై స్పందించిన భారత మాజీ కోచ్ రవిశాస్త్రి.. అతడు మైదానంలో దిగితే గెలుపే లక్ష్యంగా ఆడతాడన్నారు. మైదానంలో దేనీ గురించీ విరాట్ పట్టించుకోడన్నారు. ఇక మైదానం బయట మాత్రం పూర్తి భిన్నంగా.. చాలా సరదాగా ఉంటాడని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోహ్లీ కొద్ది నెలలు విరామం తీసుకొని తిరిగి జట్టుకు ఆడితే మంచి ఫలితాలు ఉంటాయని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.
Also Read: Nagarjuna on Samantha Divorce: సమంతపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు.. నాగచైతన్యతో విడాకులపై స్పందన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
చెపితే నమ్మరు కానీ.. ఇప్పటికీ నా దగ్గర ధోనీ ఫోన్ నంబర్ లేదు! టీమిండియా మాజీ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!!
ఎంఎస్ ధోనీపై రవిశాస్త్రి ప్రశంసల వర్షం
ధోనీ లాంటి ఆటగాడు మాత్రం ఉండదు
ఇప్పటికీ నా దగ్గర ధోనీ ఫోన్ నంబర్ లేదు