MS Dhoni's Female Fan Touches His Feet: ఆగస్ట్ 15, 2020, మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు ఒక రకంగా చీకటి రోజు లాంటిది. మహేంద్ర సింగ్ ధోనీ అన్ని ఫార్మాట్‌లలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజు అదే. ధోనీ తీసుకున్న ఆ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. భారతీయులకైతే ఆ బాధ ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. ఓవైపు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలా లేక మరోవైపు ధోనీని ఇక ఇంటర్నేషనల్ మ్యాచ్ ల్లో బ్యాట్ ఝులిపించడం చూడలేమని ఆవేదన చెందాలా అనేది అర్థం కాని పరిస్థితి వారిది. అయినప్పటికీ, ధోనీ అభిమానులు ఆయన పట్ల ఉన్న అభిమానం, గౌరవం ఇసుమంతయినా కోల్పోలేదు సరికదా.. అది అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. దటీజ్ మహేంద్ర సింగ్ ధోనీ.
క్రికెట్ విషయానికొస్తే.. మహేంద్ర సింగ్ ధోనీని ఇప్పటికీ తమ ఆరాధ్య దైవంగా భావించే అభిమానులకు కొదువే లేదు. అందుకే ధోనీ కనపడితే చాలు తమ అభిమానాన్ని చాటుకోకుండా ఉండలేరు. ధోనీని కలిసిన అభిమానులు.. ఆయనపై తమకు ఉన్న అభిమానాన్ని చాటడంలో ఒక్కొక్కరు ఒక రకమైన ప్రత్యేకతను చూపిస్తుంటారు. తాజాగా ధోనీ స్వస్థలమైన రాంఛీలో అనుకోకుండా ధోనిని కలిసిన ఒక మహిళా అభిమాని.. తన ఫేవరైట్ క్రికెటర్ పై తనకు ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని చూపిస్తూ ధోనీ పాదాలను తాకింది.
అలా ఎవరైనా అభిమానులు వచ్చి పాదాలపై పడటం ఇష్టం లేని ధోనీ.. వారిని సున్నితంగానే వారిస్తూ అడ్డుకున్న సందర్భాలు మనం గతంలోనే చూశాం. కానీ ఈ అమ్మాయి విషయంలో ధోనీ కూర్చుని ఉండటం, ఉన్నట్టుండి వెనక్కి జరిగే అవకాశం కూడా లేకపోవడంతో నవ్వుతూనే ఆ అమ్మాయిని వారించిన ధోనీ... అరేరే షేక్ హ్యాండ్ ఇస్తే సరిపోతుంది కదా అంటూ ఆ అమ్మాయితో కరచాలనం చేశాడు.
A fan touched MS Dhoni's feet upon meeting her idol.
An icon - MS...!! pic.twitter.com/RPaqFZv8xm
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 27, 2023
ఇది కూడా చదవండి : Yo-Yo Test: యో-యో టెస్టులో విఫలమై జట్టులో స్థానం కోల్పోయిన ఆటగాళ్లు ఎవరంటే..? లిస్టులో స్టార్ ప్లేయర్లు..!
ఆ అమ్మాయి ధోనీ పాదాలపై పడటం.. అతడు నవ్వుతూనే ఆ అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇవ్వడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధోనీ సింప్లిసిటీకి ఇదే నిదర్శనమని ధోనీ ఫ్యాన్స్ ట్విటర్ లో కామెంట్స్ రాస్తున్నారు. ఇంకొంతమంది ధోనీ అభిమానులు ఈ వీడియోపై స్పందిస్తూ.. ధోనీ భాయ్ లాంటి నిగర్విని ఎక్కడా చూడలేదు అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అయినా.. పొగడ్తలకు పడిపోవడం, విమర్శలకు కుంగిపోవడం లాంటివి మహేంద్ర సింగ్ ధోనీకి తెలియదు అనే విషయం మనకు కూడా తెలిసిందే కదా. అందుకే ధోనీ ' కేప్టేన్ కూల్ ' అయ్యాడు... ప్రపంచ క్రికెట్ దిగ్గజాల చేత ' మిస్టర్ కూల్ ' అని పిలిపించుకున్నాడు.
ఇది కూడా చదవండి : Virat Kohli: బీసీసీఐకి కోపం తెప్పించిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. ఆటగాళ్లందరికీ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి