ODI World Cup 2023: ఈ ఏడాది భారత్ వేదికగా జరగబోయే వన్డే ప్రపంచ కప్(World Cup 2023 )లో న్యూజిలాండ్ జట్టు(Newzealand) కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. తాజాగా నలుపు రంగు, తెల్లని నిలువు గీతలతో ఉన్న కొత్త జెర్సీని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు లాంచ్ చేసింది. కివీస్ వైస్ కెప్టెన్ టామ్ లాథమ్(Tam Latham), స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(Trent Boult), లూకీ ఫెర్గూసన్(Lockie Ferguson)లు ఈ కొత్త జెర్సీని ధరించి ఫోటోలకు పోజిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. జెర్సీ చాలా బాగుందంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
2019లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ రన్నరఫ్ గా నిలిచింది. ఫైనల్లో కివీస్ టీమ్ అనూహ్యంగా ఇంగ్లాండ్ చేతిలో ఓడి కప్ ను చేజార్జుకుంది. ఈ సారి ఎలాగైనా టైటిల్ కొట్టాలని ఆ జట్టు భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే సన్నాహాలు చేసుకుంటుంది. భారత్ వేదికగా అక్టోబరు 05 నుంచి ప్రపంచకప్ మెుదలుకానుంది. తొలి పోరులో న్యూజిలాండ్- ఇంగ్లండ్ తలపడబోతున్నాయి. ఈ వన్డే వరల్డ్ కప్ కు ముందు కివీస్ టీమ్ బంగ్లాదేశ్ గడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు సంబంధించి 15మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. ఈ సిరీస్ లో న్యూజిలాండ్ జట్టుకు లాకీ ఫెర్గూసన్ కెప్టెన్ గా వ్యవహారించనున్నాడు.
Our @cricketworldcup shirt is here!
Available | https://t.co/KYeMEalVLI#BACKTHEBLACKCAPS #CWC23 pic.twitter.com/hzYjjlmLIm
— BLACKCAPS (@BLACKCAPS) September 18, 2023
Also Read: World Cup 2023: ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా నిలిచేదెవరు..? లెక్కలు ఇలా..!
న్యూజిలాండ్ వరల్డ్ కప్ టీమ్ : కేన్ విలియమ్సన్ (సి), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచ్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, విల్ యంగ్.
Also Read: Fastest Victories in History: వన్డే చరిత్రలో ఇంతకు ముందు ఎవరెవరు ఇంత వేగంగా మ్యాచ్ గెలిచారో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook