Afghan vs Kiwis: ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా విచిత్ర పరిస్థితిలో ఉంది. ఇతర జట్ల జయాపజయాలపై టీమ్ ఇండియా భవితవ్యం ఆధారపడి ఉండటంతో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కీలకంగా మారింది.
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (Afghanistan vs Newzealand)మ్యాచ్ ఫలితంపై ఆ రెండు దేశాల్లో ఎటువంటి ఆసక్తి ఉందో లేదో తెలియదు కానీ..టీమ్ ఇండియాకు మాత్రం అత్యంత ఉత్కంఠ నెలకొంది. ఇవాళ జరగనున్న ఆఫ్ఘన్ వర్సెస్ కివీస్ మ్యాచ్ ఫలితంపై యావత్ భారతీయులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని ఇండియాలో ప్రార్ధనలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా సెమీస్‌కు అవకాశాలు ఆప్ఘనిస్తాన్(Afghanistan) విజయంపై ఆధారపడి ఉన్నాయి మరి. న్యూజిలాండ్ గెలిస్తే నేరుగా సెమీస్‌కు చేరుతుంది. టీమ్ ఇండియా(Team india)ఇంటికి చేరుకుంది. అదే ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే ఇండియా సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. అందుకే ఇండియా మొత్తం ఆఫ్గనిస్తాన్ గెలవాలని ప్రార్ధనలు చేస్తోంది.
న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు రెండూ సెమీ ఫైనల్(Semifinals) రేసులో ఉన్నాయి. న్యూజిలాండ్‌కు సమీకరణం సూటిగా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి నేరుగా సెమీఫైనల్‌లోకి ప్రవేశించాలి. సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే అఫ్గానిస్థాన్ మాత్రం భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అఫ్గానిస్థాన్ విజయంతో భారత్ కూడా ఎంతో లాభపడనుంది. సోమవారం నమీబియాతో భారత్ చివరి మ్యాచ్. ఈరోజు ఆఫ్ఘన్ జట్టు గెలిస్తే, నమీబియాతో జరిగే మ్యాచ్‌కి ముందు భారత జట్టు ఏ తేడాతో గెలవాలో తెలిసిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ కెరీర్ స్ట్రైక్ రేట్ 148.64 గా ఉంది. కానీ ఈ టోర్నమెంట్‌లో అతను కేవలం 116.88 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేయాలంటే, జజాయ్ ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాలి. మరోవైపు న్యూజిలాండ్ నుంచి ట్రెంట్ బౌల్ట్ ప్రమాదకరంగా మారవచ్చు. బౌల్ట్ టోర్నమెంట్‌లో 8 వికెట్లు పడగొట్టాడు. కానీ, పవర్‌ప్లేస్‌లో అతనికి రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. అబుదాబి ఫాస్ట్ బౌలర్ల పిచ్ కాబట్టి ఈసారి అవకాశం ఉండవచ్చు. బౌల్ట్ కొత్త బంతితో స్వింగ్ చేయగలిగితే న్యూజిలాండ్ పని సులభమైపోతుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్ ఫిట్‌నెస్‌పై పరిస్థితి ఇంకా స్పష్టంగా లేదు. అతను ఫిట్‌గా ఉంటే నవీన్-ఉల్-హక్ లేదా ఎడమచేతి వాటం స్పిన్నర్ షరాఫుద్దీన్ అష్రాఫ్‌ను భర్తీ చేస్తాడు. కివీస్ జట్టులో మార్పు వచ్చే అవకాశం లేదు. నమీబియాతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఇష్ సోధి తలకు గాయమైనా..ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాడు.
ఇక పిచ్ పరిస్థితి స్కోరింగ్ మ్యాచెస్ ఎక్కువగా జరిగాయి. పవర్‌ప్లేలో తక్కువ స్కోర్లు ఉన్నాయి. ఈ పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లకు ప్రారంభంలో తోడ్పాటు లభిస్తుంది. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ ఫ్లాట్‌గా మారుతుంది. టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్(NewZealand) ఎప్పుడూ తలపడలేదు. 2015 అలాగే 2019 వన్డే ప్రపంచ కప్‌లలో ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరిగాయి. రెండింటిలోనూ కివీ జట్టు గెలిచింది.
Also read: Ashish Nehra: 'టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా ఆ పేసర్‌కు అర్హతలున్నాయ్'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి