New Zealand Cricket: ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు(New Zealand Women Cricket team)కు తాజాగా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించిందని కివీస్ బోర్డు ప్రకటించింది. అయితే, ఈ బెదిరింపులపై తమ భద్రతా సంస్థలు దర్యాప్తు చేపట్టాయని.. అవి ఉత్తుత్తివేనని స్పష్టం చేసింది. మహిళల క్రికెటర్లు బస చేసే హోటల్‌తో పాటు స్వదేశానికి తిరిగి వెళ్లేటప్పుడు విమానంలో బాంబులు(Bombs) పెడతామని ఈసీబీ(ECB)కి ఈమెయిల్ వచ్చినట్లు సమాచారం అందింది.
మరోవైపు పాకిస్థాన్(Pakistan) పర్యటనకు ముందే తమ పురుషుల జట్టులోని కొందరిని చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయని న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్ చీఫ్ హీత్ మిల్స్ వెల్లడించారు. తొలుత అవి సామాజిక మాధ్యమాల్లో వచ్చాయని చెప్పారు. వాటిపై దర్యాప్తు చేసిన తమ భద్రతా నిపుణులు ఆ బెదిరింపులు ఉత్తివేనని తేల్చారన్నారు.
Also Read: Shoaib Akhtar Comments: ఫస్ట్ టీమిండియా.. తర్వాత న్యూజిలాండ్... అస్సలు వదలొద్దు! (వీడియో)
భద్రతా కారణాల దృష్ట్యా పాక్ పర్యటన రద్దు..
గత శుక్రవారం న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్(Pakisthan)లో ఆఖరి నిమిషంలో టోర్నీని రద్దు చేసుకొని అక్కడి నుంచి దుబాయ్‌కి వెళ్లిపోయింది. దీనిపై వెంటనే స్పందించిన పాక్ క్రికెట్ బోర్డు.. న్యూజిలాండ్‌పై ఐసీసీలో ఫిర్యాదు చేస్తామని వెల్లడించింది. దీనిపై మాట్లాడిన మిల్స్ తమ బోర్డు ఈ విషయంలో ఎలాంటి అతి చేయలేదని చెప్పాడు. తమ ఆటగాళ్లు అక్కడ ఉన్నన్ని రోజులు పాక్ బలగాలు బాగా పనిచేశాయని, తాము వారి పనితీరును శంకించడం లేదని వివరించాడు. కానీ, ఆ దేశంలో తమ ఆటగాళ్లు ఉండే పరిస్థితి లేదన్నాడు. ఇలా అర్ధాంతరంగా పాక్ పర్యటనను రద్దు చేసుకోవడం మంచిది కాదని తెలిసినా ఆటగాళ్ల క్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అక్కడి నుంచి బయటపడటంతో న్యూజిలాండ్ క్రికెటర్లు ఉపశమనం పొందారన్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook