NZ Vs SL World Cup 2023: కివీస్ వచ్చేస్తోంది.. పాక్ ఆశలపై శ్రీలంక నీళ్లు.. సెమీస్‌ ఫైట్ ఇలా..!

New Zealand Vs Sri Lanka Highlights: శ్రీలంకను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసిన న్యూజిలాండ్.. సెమీ ఫైనల్‌లో నాలుగో టీమ్‌గా బెర్త్‌ను ఫిక్స్ చేసుకుంది. పాక్, అఫ్గానిస్థాన్ సెమీస్ ఆశలపై శ్రీలంక నీళ్లు చల్లినట్లయింది. కనీస పోటీ లేకుండా కివీస్ చేతిలో ఓటమి పాలైంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Nov 9, 2023, 08:25 PM IST
NZ Vs SL World Cup 2023: కివీస్ వచ్చేస్తోంది.. పాక్ ఆశలపై శ్రీలంక నీళ్లు.. సెమీస్‌ ఫైట్ ఇలా..!

New Zealand Vs Sri Lanka Highlights: ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో బెర్త్‌లు దాదాపు ఫిక్స్‌ అయిపోయాయి. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియ తొలి మూడు స్థానాలను కైవసం చేసుకోగా.. తాజాగా శ్రీలంకపై భారీ విజయంతో నాలుగో జట్టుగా న్యూజిలాండ్‌ దాదాపు బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. కివీస్ విజయంతో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ రెండు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిచినా.. నెట్‌ రన్‌రేట్ ఎక్కువగా ఉన్న న్యూజిలాండ్ ముందడుగు వేస్తుంది. ఇంగ్లాండ్‌పై పాక్ అసాధ్యంకాని రీతిలో విజయం సాధిస్తేనే సెమీస్ చేరేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక అఫ్గానిస్థాన్‌కు దారులు మూసుకుపోయాయి. దక్షిణాఫ్రికాపై భారీ విజయం సాధించినా.. తక్కువ నెట్‌రన్‌ రేట్ కారణంగా టోర్నీ నుంచి ఔట్ అవుతుంది. భారత్-న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

గురువారం బెంగుళూరురలోని చిన్నసామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకే కూప్పకూలింది. కుశాల్ పెరీరా (51) అర్థ సెంచరీ బాదగా.. తీక్షణ (38 నాటౌట్) రాణించాడు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, ఫెర్గ్యూసన్, శాంట్నర్, రచిన్ రవీంద్ర తలో రెండు వికెట్లు పడగొట్టారు. సౌథికి ఒక వికెట్ దక్కింది.

అనంతరం న్యూజిలాండ్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి.. 23.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు డేవిడ్ కాన్వే (45), రచిన్ రవీంద్ర (42) కివీస్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు కేవలం 12.2 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 86 పరుగులు జోడించారు. ఇద్దరు వెంటవెంటనే ఔట్ అవ్వగా.. విలియమ్సన్ (14) తక్కువ స్కోరుకే ఔట్ అయ్యాడు. మిచెల్ (43) దూకుడుగా ఆడాడు. చాంప్‌మన్ (7) రనౌట్ అయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ (17 నాటౌట్), టామ్ లాథామ్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 23.2 ఓవర్లలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ట్రెంట్ బౌల్ట్‌కు మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 

శ్రీలంకపై న్యూజిలాండ్‌ విజయంతో పాకిస్థాన్‌ ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు చేరే అవకాశాలకు భారీ దెబ్బ తగిలింది. సెమీస్‌కు చేరుకోవాలనే ఆశలపై శ్రీలంక నీళ్లు చల్లింది. శ్రీలంకపై న్యూజిలాండ్‌ చిత్తుగా ఓడిన పాకిస్థాన్‌ను దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. పాకిస్థాన్ అర్హత సాధించాలంటే.. వారు ఇంగ్లాంండ్‌ను 287+ పరుగులతో ఓడించాలి లేదా 284 బంతులు మిగిలి ఉంచి విజయం సాధించాలి. ఇది దాదాపు అసాధ్యం. 

Also Read: Kalabhavan Haneef: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత

Also Read: Reservation Bill: కులాల రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.. ఆ రాష్ట్రంలో 75 శాతం రిజర్వేషన్లు   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News