Womens Hockey: ఒలింపిక్స్‌లో విశేష ప్రతిభ కనబర్చిన ఆంధ్రప్రదేశ్ ఆణిముత్యం, హాకీ క్రీడాకారిణి రజనీ..ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసింది. ఈ సందర్భంగా ఆమెను సత్కరించిన జగన్..పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు.
టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)లో మహిళల హాకీ జట్టు విశేష ప్రతిభ కనబర్చడమే కాకుండా కాంస్య పతకం వరకూ దూసుకెళ్లింది. ఈ హాకీజట్టుకు దక్షిణాది రాష్ట్రాల తరపున ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రీడాకారిణి ఇ రజని ఏపీకు చెందిన మహిళ కావడం విశేషం. చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెంకు చెందిన ఇ రజని 2016 రియో ఒలింపిక్స్‌లో కూడా పాల్గొంది. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో విశేష ప్రతిభ కనబర్చింది. ఇప్పటి వరకూ 110 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఇ రజని మహిళల హాకీ జట్టులో కీలక పాత్ర పోషిస్తోంది.
ఇవాళ ఆమె ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమెను సత్కరించడమే కాకుండా పలు ప్రోత్సాహకాలు అందించారు. 25 లక్షల నగదుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో రజనీకు ప్రకటించి పెండింగ్‌లో ఉంచిన బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. తిరుపతిలో వేయి గజాల నివాస స్థలంతో పాటు నెలకు 40 వేల రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ ఛైర్మన్ సిద్ధార్ధ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also read: షావోమీ నుంచి మరో సంచలనం, త్వరలో మార్కెట్లో సైబర్ డాగ్ రోబోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook