ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌పై శ్రేయాస్ అయ్యర్ జోకులు.. అర్ధంకాక తల పట్టుకున్న ఆసీస్ క్రికెటర్! వీడియో వైరల్

Shreyas Iyer Trolls Travis Head Batting Stance during IND vs AUS 3rd Test. ఇండోర్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఛేజింగ్‌ చేస్తున్న సమయంలో ట్రావిస్‌ హెడ్‌పై శ్రేయస్‌ అయ్యర్‌ జోకులు పేల్చాడు.

Written by - P Sampath Kumar | Last Updated : Mar 4, 2023, 02:44 PM IST
  • ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌పై శ్రేయాస్ అయ్యర్ జోకులు
  • అర్ధంకాక తల పట్టుకున్న ఆసీస్ క్రికెటర్
  • హెడ్, అయ్యర్ వీడియో వైరల్
ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌పై శ్రేయాస్ అయ్యర్ జోకులు.. అర్ధంకాక తల పట్టుకున్న ఆసీస్ క్రికెటర్! వీడియో వైరల్

Shreyas Iyer Tease Travis Head Batting Stance during IND vs AUS 3rd Test: బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన భారత్.. మూడో టెస్టులో మాత్రం దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో గెలిచి.. నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో భారత ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. అంతేకాదు డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023కి కూడా దూసుకెళ్లింది. ఈ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. మార్చి 9 నుంచి ఆరంభం అయ్యే నాలుగో టెస్టులో గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడుతుంది.

ఇండోర్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఛేజింగ్‌ చేస్తున్న సమయంలో ట్రావిస్‌ హెడ్‌పై శ్రేయస్‌ అయ్యర్‌ జోకులు పేల్చాడు. ఇదంతా స్టంప్‌ మైక్‌లో రికార్డయ్యింది. ఆరో ఓవర్‌లో స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌ చేస్తున్న సమయంలో షార్ట్‌ ఫైన్‌ లెగ్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న అయ్యర్.. హెడ్‌ బ్యాటింగ్ స్టాన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ట్రావిస్‌ హెడ్‌ ఒక కాలు చండీగఢ్‌లో ఉంటే.. మరో కాలు హరియాణాలో ఉంది' అని హిందీలో అన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలు అర్థం కాకపోవడంతో.. హెడ్‌ ఏమీ అనకుండా ఉండిపోయాడు.

ట్రావిస్‌ హెడ్‌పై శ్రేయస్‌ అయ్యర్‌ జోకులు పేల్చడం స్టంప్‌ మైక్‌లో రికార్డయ్యింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అయ్యర్ మాటలు అర్ధంకాక  హెడ్‌ తల పట్టుకుని ఉంటాడు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ట్రావిస్‌ హెడ్‌ కీలక ఇన్నింగ్స్ (49 నాటౌట్‌) ఆడాడు. మార్నస్‌ లబుషేన్‌ (28 నాటౌట్‌)టి కలిసి ఆస్ట్రేలియా జట్టును విజయ తీరాలకు చేర్చాడు. భారత్‌ నిర్ధేశించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌ 18.5 ఓవర్లలోనే ఒక్క వికెట్‌ కోల్పోయి ఛేదించింది. 

Also Read: Python Vial Video: ఏలూరు జిల్లాలో కొండచిలువల హల్‌చల్‌.. ఐదింటిని హతమార్చిన గ్రామస్తులు! వైరల్ వీడియో   

Also Read: 20 వేల రియల్‌మీ 10 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 649కే.. ఈ అవకాశం మళ్లీమళ్లీ రాదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News