Ravindra Jadeja Wife Vs Sister in Gujarat Election: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతోంది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. రెండు దశల్లో పోలింగి జరగనుంది. 89 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 1న, 93 స్థానాలకు డిసెంబర్ 5న ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు అభ్యర్థుల జాబితా తయారీలో తలమునకలవుతున్నాయి. ఇక జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది.
ఈ సీటు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. క్షత్రియ ప్రాబల్యం ఉన్న ఈ సెగ్మెంట్లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య, సోదరి మధ్య పోటీ ఉండబోతుంది. జడేజా భార్య రివాబా జడేజా ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆమె 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరగా.. రవీంద్ర జడేజా సోదరి నైనా జడేజా 2019 ఏప్రిల్‌లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి నైనా రాజకీయంగా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. జామ్‌నగర్ కాంగ్రెస్ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఈసారి ఆమెను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు బీజేపీ నుంచి జడేజా భార్య రివాబా జడేజా ఈ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ నుంచి గెలుపొందిన ధర్మేంద్ర సింగ్ జడేజా ఎమ్మెల్యేగా ఉన్నారు. 2012లో కాంగ్రెస్ టిక్కెట్‌పై ధర్మేంద్ర సింగ్ జడేజా గెలుపొందగా.. 2017లో ఆయన పార్టీ మారి బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ సారి కూడా ధర్మేంద్ర సింగ్ తనకు మళ్లీ టికెట్ వస్తుందని ఆశతో ఉన్నారు.
అయితే రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ విజ్ఞప్తితో ఆయనకు టికెట్ రావడం కష్టమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ రాని పక్షంలో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలోకి వెళతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ స్థానం నుంచి కర్సన్భాయ్ కర్మూర్‌ను బరిలోకి దింపింది. ఈ పరిస్థితుల్లో ఆయనకు టికెట్ రాకపోతే ఇంట్లో కూర్చొవాల్సిందే. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో క్షత్రియ ఓటర్లు ఉన్నారు.
గూండా ఇమేజ్ ఉన్న వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వవద్దని రాజ్యసభ ఎంపీ పరిమల్ నత్వానీ అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. జామ్‌నగర్ ప్రధాన పారిశ్రామిక నగరమని.. శాంతియుతంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జామ్‌నగర్‌ను నేరాలవైపు తీసుకెళ్లే వారికి రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇవ్వకూడదని ఆయన కోరారు. నేరుగా ధర్మేంద్ర సింగ్ జడేజా పేరును ప్రస్తావించనప్పకీ.. పరోక్షంగా ఆయనను లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేశారు. దీంతో ధర్మేంద్ర సింగ్ స్థానలో రివాబా జడేజాకు టికెట్ ఇవ్వాలని డిమాండ్స్ వస్తున్నాయి.
రివాబా కొన్నాళ్లుగా సామాజిక సేవలో చురుకుగా ఉన్నందున టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జామ్‌నగర్ నార్త్‌లో మారిన సమీకరణాల్లో కాంగ్రెస్ వేచి చూడాలనే ఆలోచనలో ఉంది. రివాబాను బీజేపీ రంగంలోకి దింపితే.. రవీంద్ర జడేజా సోదరి నైనా జడేజాను పోటీ చేయించేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది.ఇదే జరిగితే సర్ రవీంద్ర జడేజా ఎన్నికల పోరులో ఎవరి తరుపున ప్రచారం చేస్తాడో చూడాలి మరి.
Also Read: Rohit Sharma: సెమీస్‌కు ముందు ఆ ప్లేయర్‌కు బిగ్ రిలీఫ్.. రోహిత్ శర్మ సపోర్ట్
Also Read: Justice DY Chandrachud: తండ్రి బాటలో తనయుడు.. జస్టిస్ చంద్రచూడ్‌లో ఉన్న ప్రత్యేకతలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook