Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. సరికొత్త చరిత్ర లిఖించిన మను భాకర్

Manu Bhaker and Sarabjot Singh won second Bronze in Shooting:  పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. రబ్‌జోత్‌ సింగ్‌, మను భాకర్‌ జోడి మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్తల్‌ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 30, 2024, 02:34 PM IST
Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. సరికొత్త చరిత్ర లిఖించిన మను భాకర్

Manu Bhaker and Sarabjot Singh won second Bronze in Shooting: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకం సొంతం చేసుకుంది. మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్తల్‌ విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్‌, మను భాకర్‌ జంట కాంస్య పతకం సాధించింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం. మనుకి కూడా ఇది 2వ పతకం కావడం విశేషం. ఒలింపిక్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలను సాధించిన మొదటి మహిళా అథ్లెట్‌గా మను భాకర్ చరిత్ర సృష్టించింది. కాంస్య పోరులో దక్షిణ కొరియాతో పోటీపడిన సరబ్‌జోత్‌ సింగ్‌, మను భాకర్‌ జోడి.. 16 పాయింట్లు సాధించింది. దక్షిణ కొరియా వాళ్లు 10 పాయింట్లు సాధించడంతో కాంస్య పతకం భారత్ సొంతమైంది. 

కాంస్య పతకం సాధించిన సరబ్‌జోత్‌ సింగ్‌, మను భాకర్‌ జోడికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. "మా షూటర్లు మమ్మల్ని గర్వపడేలా చేస్తూనే ఉన్నారు. ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు సరబ్‌జోత్‌ సింగ్‌, మను భాకర్‌కు అభినందనలు. ఇద్దరూ అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించారు. వీరి ప్రదర్శనతో భారతదేశం చాలా సంతోషంగా ఉంది.." అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. 

 

మను భాకర్ సాధించిన రికార్డులు ఇవే..

==> 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో సుమా శిరూర్ షూటింగ్ ఫైనల్ చేరింది. ఆ తరువాత షూటింగ్ విభాగం‌లో ఫైనల్‌కు చేరిన తొలి ఇండియన్‌ షూటర్‌గా మను భాకర్ రికార్డ్ సృష్టించింది.
==> ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా కూడా ఆమె చరిత్ర సృష్టించింది.
==> ఒలింపిక్స్‌లో ఒకే ఎడిషన్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు క్రియేట్ చేసింది.
==> రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారత షూటర్‌గా మనునే కావడం విశేషం.
==> ఒలింపిక్స్‌లో జట్టుగా మెడల్ సాధించిన తొలి భారత షూటింగ్ జోడీ మను, సరబ్జోత్ సింగ్‌గా నిలిచారు.

Also Read: Snake: నాగ పంచమికి ముందు అరుదైన ఘటన.. నాగ దేవత విగ్రహం మీద పడగ విప్పిన నాగు పాము.. వీడియోవైరల్..  

Also Read: Mahindra Thar Roxx: 5 డోర్లతో మహీంద్రా థార్ రాక్స్‌ వచ్చేస్తోంది.. దిమ్మతిరిగే ఫీచర్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News