PBKS vs CSK: చివరలో చేతులెత్తేసిన చెన్నై.. పంజాబ్‌ ఘన విజయం!

PBKS vs CSK, IPL 2022: Punjab beat Chennai by 11 runs. ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ కొట్టింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 26, 2022, 12:03 AM IST
  • చివరలో చేతులెత్తేసిన చెన్నై
  • పంజాబ్‌ ఘన విజయం
  • శిఖర్ ధావన్ అజేయ హాఫ్ సెంచరీ
PBKS vs CSK: చివరలో చేతులెత్తేసిన చెన్నై.. పంజాబ్‌ ఘన విజయం!

Punjab Kings beat Chennai Super Kings by 11 runs: ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ కొట్టింది. చివరి ఓవర్ వరకు రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో చెన్నైపై పంజాబ్‌ పైచేయి సాధించింది. పంజాబ్‌ నిర్ధేశించిన 188 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై 6 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసి 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. తెలుగు తేజం అంబటి రాయుడు (78 నాటౌట్; 39 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) సూపర్ ఫిఫ్టీ బాదాడు. చివరలో రవీంద్ర జడేజా (21), ఎంఎస్ ధోనీ (12) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. పంజాబ్‌ పేసర్లు కగిసో రబాడ, రిషి ధావన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

పంజాబ్‌ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. సందీప్‌ శర్మ వేసిన రెండో ఓవర్‌ ఐదో బంతికి రాబిన్ ఉతప్ప (1) క్యాచ్‌ ఔటయ్యాడు. మిచెల్ సాంట్నర్‌ అండతో రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అయితే అర్షదీప్ సింగ్ సూపర్ బంతితో మిచెల్ సాంట్నర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో చెన్నై 2 వికెట్లకు 33 పరుగులు మాత్రమే చేసింది. ఆ కాసేపటికే శివమ్ దూబే (8), గైక్వాడ్‌ (30) కూడా ఔట్ అవ్వడంతో చెన్నై ఆశలు సన్నగిల్లాయి. 

అయితే రాహుల్ చాహర్ వేసిన 15వ ఓవర్‌లో అంబటి రాయుడు భారీ సిక్సర్‌ బాది.. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సందీప్ శర్మ వేసిన 16 ఓవర్‌లో ఫోర్, హ్యాట్రిక్ సిక్స్‌లు బాదిన రాయుడు 23 పరుగులు చేశాడు. అయితే 17వ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ 6 పరుగులే ఇచ్చాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రబడా బౌలింగ్‌లో రాయుడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివరి 12 బంతుల్లో చెన్నై విజయానికి 35 పరుగులు అవసరమవగా.. ధోనీ, జడేజా పోరాడినా ఫలితం లేకుండా పోయింది.

 అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (88 నాటౌట్; 59 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. భానుక రాజపక్స (42; 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఇన్నింగ్స్ చివరలో లియామ్ లివింగ్‌స్టోన్ (19; 7 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్‌) మెరుపులు మెరిపించాడు. చెన్నై బౌలర్లలో పేసర్ డ్వేన్ బ్రావో రెండు వికెట్లు తీయగా.. స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఓ వికెట్ పడగొట్టాడు.

Also Read: Elon Musk Twitter: ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్.. భారీ డీల్ ​డీటెయిల్స్ ఇవే?

Also Read: Vaani Kapoor Bikini Pics: బికినీలో వాణీ క‌పూర్.. అసలక్కడ నడుముందా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News