PBKS vs GT: లివింగ్‌స్టోన్ మెరుపు హాఫ్ సెంచరీ.. గుజరాత్ లక్ష్యం ఎంతంటే?

Punjab post 189 Target to Gujarat. గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచులో పంజాబ్‌ కింగ్స్ భారీ సాకర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 189 రన్స్ చేసి.. గుజరాత్ ముందు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2022, 10:04 PM IST
  • లివింగ్‌స్టోన్ మెరుపు హాఫ్ సెంచరీ
  • ధాటిగా ఆడిన రాహుల్ చాహర్‌
  • గుజరాత్ లక్ష్యం ఎంతంటే?
PBKS vs GT: లివింగ్‌స్టోన్ మెరుపు హాఫ్ సెంచరీ.. గుజరాత్ లక్ష్యం ఎంతంటే?

Punjab Kings post 189 Target to Gujarat Titans after Liam Livingstone fifty: గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచులో పంజాబ్‌ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 189 రన్స్ చేసి.. గుజరాత్ ముందు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ బ్యాటర్లలో లియామ్ లివింగ్‌స్టోన్ (64: 27 బంతుల్లో 7×4, 4×6) మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. ఐపీఎల్ 2022లో ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (35), జితేశ్ శర్మ (23) విలువైన పరుగులు జోడించారు. ఇక ఇన్నింగ్స్ చివరలో రాహుల్ చహర్‌ (22 నాటౌట్) ధాటిగా ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. గుజరాత్‌ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు, దర్శన్ నల్కండే రెండు వికెట్లు పడగొట్టారు. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 5 పరుగులకే ఔట్ అయ్యాడు. ఐపీఎల్ 2022లో తొలి మ్యాచ్ ఆడుతున్న జానీ బెయిర్‌స్టో (8) కూడా నిరాశపరిచాడు. ఈ సమయంలో మరో ఓపెనర్ శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్ జట్టును ఆడుకున్నారు. రెండు వికెట్లు పడ్డా.. ఈ ఇద్దరు ధాటిగానే ఆడారు. బౌండరీలు బాదుతూ పంజాబ్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. 10 ఓవర్లు ముగిసేసరికి 86 పరుగులు చేసింది. 

అయితే 11వ ఓవర్ మొదటి బంతికి శిఖర్ ధావన్ ఔట్ అయ్యాడు. రాహుల్ తెవాటియా వేసిన 13వ ఓవర్లో జితేశ్ శర్మ (23) రెండు సిక్సులు బాదగా.. లివింగ్‌ స్టోన్‌ ఓ సిక్స్, ఓ ఫోర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దర్శన్‌ నల్కండే వేసిన తర్వాతి ఓవర్లో భారీ షాట్‌కి ప్రయత్నించిన జితేశ్.. శుభ్‌మన్‌ గిల్‌కి చిక్కి ఔట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే ఓడీన్‌ స్మిత్‌ (0) కూడా భారీ షాట్‌కి ప్రయత్నించి గిల్‌కే చిక్కాడు. అయితే 15వ ఓవర్లో షారుఖ్‌ ఖాన్‌ (14), లివింగ్‌స్టోన్‌ ఔట్ అయ్యారు. దాంతో పంజాబ్ స్వల్ప స్కోరుకే పరిమితం అవుతుందని అందరూ అనుకున్నారు. ఇన్నింగ్స్ చివరలో రాహుల్ చహర్‌ బౌండరీలు బాది జట్టును ఆదుకున్నాడు. చివరకు 20 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 

Also Read: Allu Arjun: తగ్గేదే లే.. అల్లు అర్జున్ వ్యానిటీ వ్యాన్‌ అదిరిపోయింది! ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Also Read: RGV: రామ్ గోపాల్ వర్మని ముద్దుల్లో ముంచెత్తిన ప్రముఖ హీరోయిన్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News