Dhawan Meets Pushpa: పుష్పరాజ్ బాటలో మరో స్టార్ క్రికెటర్.. తగ్గేదే లే అంటున్న గబ్బర్

Dhawan Meets Pushpa: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీమ్ఇండియా బ్యాటర్ శిఖర్ ధావన్.. ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటాడు. ఫన్నీ మీమ్స్‌, డ్యాన్స్‌లు సహా పలు సినిమాల్లోని పాటలకు అప్పుడప్పుడూ డ్యాన్సులు వేస్తుంటాడు. ఇప్పుడు 'పుష్ప' సినిమాలోని అల్లు అర్జున్ చెప్పిన మార్క్ డైలాగ్ చెప్పాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2022, 12:16 PM IST
Dhawan Meets Pushpa: పుష్పరాజ్ బాటలో మరో స్టార్ క్రికెటర్.. తగ్గేదే లే అంటున్న గబ్బర్

Dhawan Meets Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' మూవీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. పుష్ప మూవీలో బన్నీ చెప్పే 'తగ్గేదేలే..' డైలాగ్ ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. 

ప్రతిఒక్కరూ ఇదే డైలాగ్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సినీప్రముఖులతో పాటు క్రికెటర్లు కూడా 'పుష్ప' పాపులర్ డైలాగ్ కు ఫిదా అయిపోతున్నారు. 

ఈ నేపథ్యంలో క్రికెటర్లు డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా కూడా 'తగ్గేదే లే' అంటూ పుష్ప రాజ్ ను ఇమిటేట్ చేశారు. ఇప్పుడదే డైలాగ్ తో టీమ్ఇండియా ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్ ఆకట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

ఈ వీడియోను చూసిన 'పుష్ప' మూవీ హీరో అల్లు అర్జున్ కామెంట్ చేశాడు. 'హలో గబ్బర్' అంటూ అల్లు అర్జున్ కామెంట్ చేశారు. మరోవైపు పుష్ప డైలాగును క్రికెటర్లు అనుకరించడం చూసి తెలుగు ప్రేక్షకులు ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు.

శిఖర్ ధావన్.. గత కొంతకాలంగా బెంచ్ కే పరిమితమై, ఇప్పుడు దక్షిణాప్రికాతో జరిగే వన్డే సిరీస్ కోసం ఎంపికయ్యాడు. మంగళవారం రాత్రి భారత వన్డే టీమ్ సౌతాఫ్రికాకు బయల్దేరింది. జనవరి 19 నుంచి ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

Also Read:Sunny Leone Bikini Pics: మాల్దీవుల్లో బికినీతో సేదతీరుతున్న సన్నీ లియోన్

Also Read: Pushpa Craze: కేరళ ఆలయంలో మారుమోగిన పుష్ప సాంగ్.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News