Jadeja Press Conference: ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిస్తే ఏం చేస్తారు?.. చమత్కారంగా జవాబిచ్చిన జడేజా

Jadeja Press Conference: టీ20 వరల్డ్ కప్ లో (T20 World Cup 2021) శుక్రవారం స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో (India Vs Scotland) స్పిన్నర్ రవీంద్ర జడేజా అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. అయితే మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో తనకు ఎదురైన ప్రశ్నకు తనదైన శైలీలో చమత్కరించాడు. ఇప్పుడా వీడియా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 11:06 AM IST
Jadeja Press Conference: ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిస్తే ఏం చేస్తారు?.. చమత్కారంగా జవాబిచ్చిన జడేజా

Jadeja Press Conference: టీ20 వరల్డ్ కప్ లో (T20 World Cup 2021) భాగంగా స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమ్ఇండియా విజయం సాధించింది. ఇదే మ్యాచ్ లో (India Vs Scotland) భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి స్కాట్లాండ్‌ జట్టు ఓటమికి కారణమయ్యాడు. దీంతో రవీంద్ర జడేజా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

మ్యాచ్‌ గెలిచిన తర్వాత విలేకర్ల సమావేశం జడ్డూ మాట్లాడుతూ.. తన ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ఆటను పూర్తిగా ఆస్వాదించినట్లు పేర్కొన్నాడు. ఇదే ఫామ్ కొనసాగితే టీమ్ ఇండియాను ఎవరూ ఓడించలేరని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే ఇండియా సెమీస్ అవకాశాలు.. న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ మ్యాచ్ ఫలితం ఆధారంగా ఉందని అందరికి తెలిసిందే. ఇదే విషయమై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు తనదైన చమత్కారంతో సమాధానం ఇచ్చాడు జడేజా. ఒకవేళ ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిస్తే ఏం చేస్తారు? అంటూ ఒకరు ప్రశ్నించగా.. “అప్పుడు బ్యాగులు సర్దుకొని ఇంటికి వెళ్లిపోతాం. ఇంకేం చేస్తాం!” అంటూ జడేజా (Jadeja Press Conference) బదులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Also Read: T20 WC 2021 India vs Scotland: టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన...స్కాట్లాండ్​పై భారత్ గెలుపు

Also Read: New Zealand Tour Of India: ఇండియాతో సిరీస్ కు జట్టును ప్రకటించిన న్యూజిలాండ్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News