Urvashi Rautela-Pant: ఊర్వశి ఊర్వశి అని ఎగతాళి చేసిన ఫాన్స్.. రిషబ్ పంత్ రియాక్షన్ చూస్తే నవ్వులే!

Rishabh Pant reaction to Urvashi Rautela chants during India vs Pakistan. టీ20 ప్రపంచకప్‌ 2022లో కూడా ఊర్వశి రౌటెలా కారణంగా రిషబ్ పంత్ అభిమానుల చేతిలో అభాసుపాలు కావాల్సి వచ్చింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 26, 2022, 10:17 AM IST
  • ఊర్వశి ఊర్వశి అని ఎగతాళి చేసిన ఫాన్స్
  • రిషబ్ పంత్ రియాక్షన్ చూస్తే నవ్వులే
  • పాకిస్థాన్‌పై భారత్ విజయం
Urvashi Rautela-Pant: ఊర్వశి ఊర్వశి అని ఎగతాళి చేసిన ఫాన్స్.. రిషబ్ పంత్ రియాక్షన్ చూస్తే నవ్వులే!

Rishabh Pant reaction goes viral after Fans chants Urvashi Rautela during India vs Pakistan: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్, బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటెలా మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. కొంతకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ ఇద్దరూ.. ఇటీవలి కాలంలో ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఊర్వశి అయితే బోల్డ్ కామెంట్స్‌ చేస్తూ పంత్ స్థాయిని దిగజార్చింది. ఊర్వశి కామెంట్స్ కారణంగా పంత్ ఘోర అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2022లో కూడా ఊర్వశి కారణంగా పంత్ అభిమానుల చేతిలో అభాసుపాలు కావాల్సి వచ్చింది. 

టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్ 12లో భాగంగా గత ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచులో పంత్‌కు ఊహించని ఘటన ఎదురైంది. దినేశ్ కార్తీక్ తుది జట్టులో ఉండడంతో పంత్‌కు చోటు లేకపోయింది. దాంతో టీమిండియా యువ వికెట్ కీపర్ 12వ ప్లేయర్‌గా జట్టుకు సేవలందించాడు. భారత ఫీల్డర్లు ఫీల్డింగ్ చేస్తుండగా.. పంత్‌ వాటర్ బాటిల్‌లు అందించాడు. బౌండరీ లైన్ వద్ద ఉన్న పేసర్ అర్షదీప్ సింగ్‌కు వాటర్ బాటిల్‌ అందిస్తున్న సమయంలో కొంత మంది ఫాన్స్ 'ఊర్వశి ఊర్వశి' అంటూ పంత్‌ను ఎగతాళి చేశారు. 

మైదానంలోని ఆకతాయిల వ్యాఖ్యలను రిషబ్ పంత్ ముందుగా విని వినిపించనట్లు వ్యవహరించాడు. చాలా సమయం ఫాన్స్ అలానే అరుస్తుండడంతో చిరాకు పడిన పంత్.. చేతులు ఊపుతూ ఏదో అన్నాడు. కానీ అతను ఏమి చెప్పాడో స్పష్టంగా తెలియరాలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన చూసిన పంత్ ఫాన్స్.. ఊర్వశి రౌటెలాపై మండిపడుతున్నారు. 'భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన పంత్‌ను ఇలా అనడం సమంజసం కాదు', 'అంతా ఊర్వశి రౌటెలా వల్లే' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇటీవలి కాలంలో రిషబ్ పంత్, ఊర్వశి రౌటెలా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. 'మిస్టర్ ఆర్పీ నాకోసం 10 గంటల పాటు హోటల్ లాబీలో వెయిట్ చేశాడు. నేను షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చి నిద్రపోయాను. లేచాక ఫోన్ చూస్తే.. 16-17 మిస్డ్ కాల్స్. కాల్ చేసి ముంబైలో కలుస్తానని చెప్పా. అప్పటినుంచి ఆర్పీ సరిగా మాట్లాడలేదు' అని ఊర్వశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ విషయంపై పంత్ ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని అప్‌లోడ్ చేస్తూ సీరియస్ అయ్యాడు. పాపులారిటీ కోసం అబద్ధాలు ఆడతారు, నన్ను వదిలేయ్ అంటూ ఓ పోస్ట్ చేశాడు. 

Also Read: నేను చెత్తగా ఆడాను.. నా బ్యాటింగ్ నాకే అసహ్యం వేసింది! ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Also Read: Kali Mata Temple Prasad Money: ప్రసాదం బదులుగా డబ్బులు పంచిన పూజారి.. ఎగబడ్డ జనాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News