మైదానంలోకి దూసుకొచ్చిన రోహిత్ అభిమాని.. కాళ్లపై పడి.. తరువాతేం జరిగింది..??

ఇండియా Vs న్యూజిలాండ్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర సంఘటన నెలకొంది.. మైదానంలోకి దూసుకొచ్చిన ఒక అభిమాని రోహిత్ కాళ్ల పై పడ్డాడు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2021, 12:09 PM IST
  • రెండో టీ 20లో భారత్ ఘన ఘనవిజయం
  • మ్యాచ్ మధ్యలో రోహిత్ కాళ్లపై పడ్డ అభిమాని
  • ఘటనపై సీరియస్ అవుతున్న మాజీలు
  • సెక్యూరిటీ మరింత పెంచాలని సూచన
మైదానంలోకి దూసుకొచ్చిన రోహిత్ అభిమాని.. కాళ్లపై పడి.. తరువాతేం జరిగింది..??

Rohit Sharma Left Stunned as Fan Fools Security: టీ 20 ప్రపంచకప్ (T20 World Cup 2021) లో నిరాశతో వెనుదిరిగిన టీమిండియా - న్యూజిలాండ్ (India Vs New Zealand) తో 3 మ్యాచ్ ల పేటీఎమ్ టీ 20 (Paytm T20 Series 2021) సీరీస్ ఆడుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన మొదటి టీ 20 మ్యాచ్ లో మరియు శుక్రవారం జరిగిన రెండో టీ 20 మ్యాచ్ లో కూడా భారత్ గెలిచి సీరీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.. 

అయితే శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర సంఘటన నెలకొంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో మ్యాచ్ లో రోహిత్ శర్మ (Rohit Sharma) అభిమాని గ్రౌండ్ సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలో చొరబడ్డాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో ఒక అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలో పరిగెత్తుకు వచ్చి, రోహిత్ కాళ్లపై పడ్డాడు.. అది గమనించిన సెక్యూరిటీ వెంటనే అతడిని గ్రౌండ్ బయటకు పంపేసింది

Also Read: IND Vs NZ 2nd T20*: 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం

ఈ సంఘటనను పలువురు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఇపుడు వైరల్ గా మారింది. అయితే ఈ ఘటన పై పలువురు మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు.. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి, కాగా.. ప్రస్తుతం.. కరోనా నేపథ్యంలో ఆటగాళ్లు బయోబాబుల్ (Biobubble) లో గడుపుతున్నారని, ఏదైనా జరిగితే అది సీరీస్ పై ప్రభావం చూపుతుందని మాజీలు వాపోతున్నారు. 

అంతేకాకుండా.. మైదానంలో మ్యాచ్ జరిగే సమయంలో భద్రతా సిబ్బంది మరింత పటిష్టమైన చర్యలు తీసుకోచాలని సూచిస్తున్నారు. కానీ ఆ అభిమాని మాత్రం రోహిత్ శర్మను ముట్టుకోలేదు.. కేవలం దూరంగా ఉండి, కాళ్లపై పడ్డాడు.. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అతడికి దూరంగా ఉన్నాడే తప్ప ముట్టుకోలేదు.. 

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కారణంగా.. న్యూజిలాండ్ టీమ్ మొదట బ్యాటింగ్ చేసింది.. గప్టిల్‌ (31), డారిల్‌ మిచెల్‌ (31), గ్లెన్‌ ఫిలిప్స్‌ (34) పరుగులు చేయటంతో... టీమిండియా టార్గెట్ 154 పరుగులు నిర్దేశించబడింది. 

Also Read: PM Kisan Scheme: రూ.55-రూ.200 కట్టండి.. నెలకు రూ.3 వేలు పెన్షన్ పొందండి.. రైతులకు మాత్రమే

తరువాత, టార్గెట్ చేధించే క్రమంలో.. ఓపెనర్లు రాహుల్ (65) పరుగులు, రోహిత్ శర్మ (55) పరుగులు చేయటంతో టీమిండియా గెలుపు సులభతరం అయింది. మొదటి నుండే దూకుడు మీదున్న భారత్ ఆటగాళ్లు మొదట్లోనే మ్యాచ్ ను తమవైపు తిప్పేశారు.. తరువాత రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ, రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్ మ్యాచ్ ను ఫినిష్ చేశారు.. దీంతో టీమిండియా 2-0 తో సీరీస్ సొంతం చేసుకుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News