విరుష్క హనీమూన్ కు వెళ్లారు.. ఎక్కడో తెలుసా?

విరాట్ మరియు అనుష్క వివాహం కోసం ఇటలీలోని టుస్కానీని ఎంచుకున్నారు. ఇప్పుడు ఆ జంట ఎక్కడికి వెళ్ళాలబ్బా.. అని అలోచించి.. చివరకు హనీమూన్ కోసం ఒక ప్రదేశం అనుకున్నారు. ఇప్పుడు వారిద్దరూ ఆ స్పాట్ కే వెళ్లారు. ఇంతకీ ఆ హానీమూన్ డెస్టినేషన్ ఏదో చెప్పలేదు కదూ.. ! ఇటలీలోని రోమ్.. 

Last Updated : Dec 13, 2017, 04:04 PM IST
విరుష్క హనీమూన్ కు వెళ్లారు.. ఎక్కడో తెలుసా?

ముంబై: విరాట్ మరియు అనుష్క వివాహం కోసం ఇటలీలోని టుస్కానీని ఎంచుకున్నారు. ఇప్పుడు ఆ జంట ఎక్కడికి వెళ్ళాలబ్బా.. అని అలోచించి.. చివరకు హనీమూన్ కోసం ఒక ప్రదేశం అనుకున్నారు. ఇప్పుడు వారిద్దరూ ఆ స్పాట్ కే వెళ్లారు. ఇంతకీ ఆ హానీమూన్ డెస్టినేషన్ ఏదో చెప్పలేదు కదూ.. ! ఇటలీలోని రోమ్.. 

డిసెంబరు 12న వివాహం ముగిశాక మిస్టర్ అండ్ మిసెస్ కోహ్లీ, వారి కుటుంబ సభ్యులతో పాటు బోర్గో ఫినాచీజియో నుండి మధ్యాహ్నం 3 గంటలకు చెక్ అవుట్ చేశారు. బాలీవుడ్ లోని ఒక వెబ్సైటు ప్రకారం.. కోహ్లీ, అనుష్క కుటుంబాలు రిసెప్షన్ సన్నాహాలను ఏర్పాటు చేయడానికి ఇండియాకు తిరిగి వస్తున్నారు. కానీ ఈ ప్రేమపక్షులు ఇప్పుడు వారి హనీమూన్ ను రోమ్ లో గడపడానికి నిర్ణయించారట. మంగళవారం సాయంత్రం వారిద్దరూ రోమ్ కు బయలుదేరారని చెప్పుకొచ్చింది. 

 డిసెంబర్ 21 న ఢిల్లీలో విరాట్ తన కుటుంబ సభ్యుల కోసం రిసెప్షన్ ఏర్పాటుచేశాడు. ముంబైలో అనుష్క డిసెంబరు 26న రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఈ రిసెప్షన్ కు సచిన్ టెండూల్కర్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, యువరాజ్ సింగ్ వంటి ప్రముఖులు హాజరుకానున్నారు.

నూతన సంవత్సరం వరకు కోహ్లీతో అనుష్క ఉంటారు. జనవరి మొదటివారంలో ముంబైకు తిరిగి వస్తారు. షారుఖ్ ఖాన్ తో కలిసి నటిస్తున్న ఆనంద్ ఎల్. రాయ్ సినిమాలో నటిస్తారు. ఫిబ్రవరి 9వ తేదీన విడుదల కానున్న 'పారీ' చిత్రం ప్రచారంలో కూడా  ఆమె పాల్గొంటారు. 

Trending News