IPL 2022: సచిన్ టెండూల్కర్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. గాడ్ ఆఫ్ క్రికెట్ గా సచిన్ ను పిలుస్తారు. 2013లో అన్ని ఫార్మాట్స్ నుంచి సచిన్ రిటైడ్ అయ్యాడు. అప్పటినుంచి కూడా ముంబై ఇండియన్స్ జట్టు మెంటర్ గా ఉన్నాడు. ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ముంబై ఈ సారి ఘోర పరాజయం పాలవుతూ వస్తోంది. ముంబై జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఫ్యాన్స్ కూడా ఢీలా పడ్డారు. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచుల్లోనూ రోహిత్ సేన ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. రోహిత్ సేన గురువారం రాజస్థాన్ తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు నెట్స్ లో కఠోర సాధన చేస్తున్నారు. ఆ వ్యక్తుల్లో ముంబై మెంటర్ అయిన సచిన్ కూడా ఉన్నాడు. అవును.. సచిన్ నెట్స్ లో లెగ్ స్పిన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు.
2008 నుంచి కూడా ముంబై ఇండియన్స్ కే ప్రాతినిధ్యం వహించాడు సచిన్. నెట్స్ లో నాలుగుసార్లు బౌల్ చేసిన సచిన్.. రెండు సార్లు స్టంప్స్ ను హిట్ చేశాడు. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు ముంబై ప్లేయింగ్ ఎలెవన్ లో సచిన్ కు చోటు ఇవ్వాలని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ రీట్విట్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ప్రస్తుతం జట్టులో ఉన్నవారికంటే సచినే బెటర్ గా కనిపిస్తున్నాడు అని ట్వీట్ చేశారు.
ఈ వీడియోను పోస్టు చేస్తూ ముంబై ఇండియన్స్.. సచిన్ తీసిన ఓ వికెట్ ను గుర్తుచేసింది. ముల్తాన్ టెస్టు సిరీస్ లో భాగంగా మూడో రోజు ఆటలో పాకిస్తాన్ ఆటగాడు మొయిన్ ఖాన్ ను గూగ్లీ డెలివరీతో సచిన్ ఔట్ చేశాడు. ఇది 2004లో ఇండియా పాకిస్తాన్ టూర్ కి వెళ్లినప్పుడు జరిగింది. మాకు ఇది స్పెషల్ .. మరి మీకేది స్పెషల్ అని ట్యాగ్ చేసింది. మొత్తంగా ఈ సీజన్ లో ముంబై అధికారికంగా లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన తొలి జట్టు.
సచిన్ ఐపీఎల్ కేరీర్ లో మొత్తం 78 మ్యాచులు ఆడాడు. 34.84 యావరేజ్ తో 2334 పరుగులు సాధించాడు. ఐపీఎల్ ఆరంభసీజన్ అంటే 2008 నుంచి ఆడిన సచిన్.. 2013లో రిటైర్ అయ్యాడు. ఆరు ఎడిషన్లలో ఆడిన సచిన్.. కేవలం ఒకే ఒక్క సెంచరీ నమోదు చేశాడు. 2011లో కోచ్చి టస్కర్స్ పై ఈ ఫీట్ సాధించాడు. కేవలం 66 బంతుల్లోనే సచిన్ తన మొదటి, చివరి ఐపీఎల్ సెంచరీ చేశాడు. ఇక సచిన్ టెండూల్కర్.. 2009 సీజన్ లో మాత్రమే బౌలింగ్ చేశాడు. కేవలం 36 బంతులు వేసి 58 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
Also Read: Shani in Dream: నిద్రలో వచ్చే కలలో శనీశ్వరుడు కనిపిస్తే శుభమా? అశుభమా?
Also Read: India Power Crisis:దేశంలో కరెంట్ కష్టాలు.. 42 ప్యాసింజర్ రైళ్లు రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook