Sachin Tendulkar తొలిసారి ఏ దేశం తరుఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడంటే

Sachin Tendulkar Latest News: సచిన్ టెండూల్కర్ 1989లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడానికి రెండేళ్ల ముందు జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నాడు. అయితే తన కెరీర్‌లో ఎన్నటికీ మరిచిపోలేని ఓ సంఘటనను సిచన్ తాజాగా షేర్ చేసుకున్నాడు. తాను టీమిండియా తరఫున అరంగేట్రం చేయకముందే పాకిస్తాన్ తరఫున ఆడానని ఆశ్చర్యకర విషయాన్ని తెలిపాడు.

Written by - Shankar Dukanam | Last Updated : May 30, 2021, 12:02 PM IST
Sachin Tendulkar తొలిసారి ఏ దేశం తరుఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడంటే

క్రికెట్ పేరు చెప్పగానే ఇండియాతో పాటు పలు ప్రపంచ దేశాలకు గుర్తొచ్చే ఆటగాళ్లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఒకరు. అయితే తన కెరీర్‌లో ఎన్నటికీ మరిచిపోలేని ఓ సంఘటనను సిచన్ తాజాగా షేర్ చేసుకున్నాడు. తాను టీమిండియా తరఫున అరంగేట్రం చేయకముందే పాకిస్తాన్ తరఫున ఆడానని ఆశ్చర్యకర విషయాన్ని తెలిపాడు.

సచిన్ టెండూల్కర్ 1989లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడానికి రెండేళ్ల ముందు జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నాడు. 1987లో భారత్, పాకిస్థాన్ జట్ల మద్య  జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రికెటర్లు జావెద్ మియాందాద్, అబ్దుల్ ఖాదీర్ లంచ్ బ్రేక్ విరామం తీసుకున్నారు. ఆ సమయంలో పాక్ ఆటగాళ్ల కోరిక మేరకు స్టాండ్‌బై ఫీల్డర్‌గా ఉన్న సచిన్ ఫీల్డిండ్ చేశాడు. ఆ సమయంలో తాను టీమిండియా స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ క్యాచ్ పట్టాలని ప్రయత్నం చేసి విఫలమైనట్లు చెప్పుకొచ్చాడు.

Also Read: IPL 2021 UAE schedule: యూఏఈలోనే ఐపిఎల్ 2021.. BCCI నిర్ణయం

ఒకవేళ తనను లాంగాన్‌కు బదులుగా మిడాన్‌లో ఫిల్డ్ సెట్ చేసినట్లయితే కచ్చితంగా కపిల్ దేవ్ క్యాచ్ పట్టేవాడినని చెప్పాడు. అప్పటి పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌కు ఈ విషయం గుర్తుందో లేదో, ఆయన కోరిక మేరకు తాను దాయాది పాక్ జట్టు తరఫున ఫీల్డింగ్ చేసినట్లు పాత రోజులను నెమరువేసుకున్నాడు. ఇమ్రాన్‌ఖాన్‌కు ఈ విషయం గుర్తుందో లేదో కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో తాను తొలిసారి మైదానంలోకి దిగింది పాకిస్తాన్ తరఫున అని తెలిపి భారత క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

Also Read: SBI Cash Withdrawal Rules: క్యాష్ విత్‌డ్రా పరిమితి పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

సచిన్ చివరగా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌పై సచిన్ సారథ్యంలోని ఇండియా  లెజెండ్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News