సచిన్ టెండుల్కర్ గురువు రమాకాంత్ అచ్రేకర్ ఇక లేరు

సచిన్ టెండుల్కర్ గురువు రమాకాంత్ అచ్రేకర్ ఇక లేరు 

Last Updated : Jan 2, 2019, 10:21 PM IST
సచిన్ టెండుల్కర్ గురువు రమాకాంత్ అచ్రేకర్ ఇక లేరు

ముంబై: క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌ని అంత గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దిన ఆయన గురువు రమాకాంత్ అచ్రేకర్ (87) ఇక లేరు. ఇవాళ సాయంత్రం ముంబైలో ఆయన మృతి చెందారు. సచిన్ టెండుల్కర్, వినోద్ కాంబ్లి వంటి దిగ్గజ క్రికెటర్లకు రమాకాంత్ క్రికెట్‌లో శిక్షణ ఇచ్చి మెళకువలు నేర్పారు. "తాను చిన్నపిల్లాడిగా వున్నప్పటి నుంచే తనకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించిన తన గురువు రమాకాంత్ గారు.. అప్పట్లో ముంబైలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్‌లు జరిగినా అక్కడికి ఆయనే స్వయంగా స్కూటర్‌పై వెంటపెట్టుకుని వెళ్లేవారు" అని ఒకానొక సందర్భంలో సచిన్ టెండుల్కర్ గుర్తుచేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని దాదర్‌లో వున్న శివాజీ పార్క్ వేదికగా ఎంతో మంది ఔత్సాహిక యువ క్రికెటర్లకు రమాకాంత్ శిక్షణ ఇచ్చారు. రమాకాంత్ ఆచ్రేకర్ మృతితో క్రీడా ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. 

Trending News