Sachin Tendulkar: సచిన్‌ డీప్‌ఫేక్‌ వీడియో అప్ డేట్.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ముంబై పోలీసులు..

Sachin Tendulkar: మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ తెందూల్కర్‌ డీప్‌ఫేక్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై ముంబై పోలీసులు చర్యలు చేపట్టారు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2024, 01:00 PM IST
Sachin Tendulkar: సచిన్‌ డీప్‌ఫేక్‌ వీడియో అప్ డేట్.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ముంబై పోలీసులు..

Sachin Tendulkar Deepfake Video Update:  ఈ మధ్య సెలబ్రిటీల డీప్‌ఫేక్‌ (Deepfake) వీడియోలు నెట్టింట కలకలం సృష్టిస్తున్నాయి. గతంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్‌ఫేక్‌ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ (Sachin Tendulkar) కూడా ఈ డీప్‌ఫేక్‌ బారిన పడ్డాడు. ఓ గేమింగ్‌ యాప్‌ను సచిన్‌ ప్రమోట్‌ చేస్తున్నట్టుగా సైబర్‌ నేరగాళ్లు వీడియోను క్రియేట్ చేసి నెట్టింట వదలడంతో అది కాస్తా విపరీతంగా వైరల్‌ అయ్యింది. దీనిపై మాస్టర్‌ బ్లాస్టర్‌ కూడా స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ సోషల్‌ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. 

తాజాగా ఈ ఘటనపై సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత సహాయకుడు రమేశ్ పార్డే ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ సెల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీడియోకు సంబంధించి ఓ గుర్తు తెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 500, ఐటీ చట్టంలోని సెక్షన్ 56 కింద కేసు బుక్‌ చేశారు. Skyward Aviator Request అనే గేమింగ్‌ యాప్‌ను సచిన్ ప్రమోట్‌ చేసినట్టుగా ఉన్న వీడియో సోమవారం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. . తన కూతురు సారా టెండూల్కర్‌ కూడా ఈ యాప్‌ వాడుతుందని, దీని ద్వారా యూజర్లు వేగంగా డబ్బులు సంపాదిచ్చని సచిన్‌ చెప్పినట్టుగా సైబర్‌ నేరగాళ్లు వీడియోను సృష్టించారు. ఈ విషయాన్ని సచిన్‌ తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో షేర్ చేశాడు. అంతేకాకుండా ఇది నకిలీ వీడియో అని.. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. 

Also Read: Surykuamr Yadav: సూర్యకుమార్‌కు స‌ర్జ‌రీ సక్సెస్.. ఫోటోలు షేర్ చేసిన మిస్టర్ 360 ఫ్లేయర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News