BBL 2021: అబాట్‌ స్టన్నింగ్ క్యాచ్.. ఔట్ అయ్యాననే సంగతి మరచిపోయిన క్రిస్‌ లిన్‌ (వీడియో)!!

బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌) 2021లో సీన్ అబాట్‌ కళ్లుచెదిరే క్యాచుతో క్రిస్‌ లిన్‌ను పెవిలియన్ చేర్చాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2021, 02:42 PM IST
  • సీన్ అబాట్‌ స్టన్నింగ్ క్యాచ్
  • ఔట్ అయ్యాననే సంగతి మరచిపోయిన క్రిస్‌ లిన్‌
  • క్యాచ్ ఆఫ్ ది సమ్మర్
BBL 2021: అబాట్‌ స్టన్నింగ్ క్యాచ్.. ఔట్ అయ్యాననే సంగతి మరచిపోయిన క్రిస్‌ లిన్‌ (వీడియో)!!

Sean Abbott takes stunning one handed catch to dismiss Chris Lynn in BBL 2021: క్రికెట్‌ ఆటలో కొన్ని అరుదైన, అద్భుతమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి అద్భుత క్యాచ్‌తో ఎవరూ ఊహించని రీతిలో బ్యాటర్‌లు పెవిలియన్‌ బాట పడుతుంటారు. ఒక్కోసారి ఫీల్డర్లు తమ ఫీల్డింగ్ విన్యాసాలతో అద్భుతమైన క్యాచ్‌లు పడుతుంటారు. ఐపీఎల్, పీఎస్‌ఎల్, బిగ్‌బాష్‌, సీపీఎల్ లాంటి టోర్నీలలో ఇప్పటికే మనం స్టన్నింగ్ క్యాచ్‌లు చాలానే చూశాం. తాజాగా ఆస్ట్రేలియా పేసర్ సీన్ అబాట్‌ అలాంటి ఓ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. బిగ్‌బాష్‌ లీగ్‌ (BBL) 2021లో అబాట్‌ కళ్లుచెదిరే క్యాచుతో క్రిస్‌ లిన్‌ను పెవిలియన్ చేర్చాడు. తాను ఔట్ అయ్యాననే సంగతి మరచిపోయిన క్రిస్‌ లిన్‌ అలా నిల్చుని చూస్తుండిపోయాడు. 

బీబీఎల్‌ 2021లో సిడ్నీ సిక్సర్స్‌, బ్రిస్బేన్‌ హీట్‌ జట్ల మధ్య తాజాగా మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్రిస్బేన్ హీట్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ జిమ్మీ పియర్సన్, క్రిస్ లిన్ ఓపెనర్లుగా బరిలో దిగారు. హార్డ్ హిట్టర్ అయిన లిన్.. ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఫాస్ట్ బౌలర్ బెన్ ద్వార్షుయిస్ ఇన్నింగ్స్ 4వ ఓవర్లోని బంతిని లిన్ ముందుకు వెళ్లి బలంగా బాదాడు. అయితే కవర్స్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సీన్ అబాట్ అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. అబాట్‌ గాల్లోకి ఎగిరి కుడి వైపుకు డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్‌ అందుకున్నాడు.

Also Read: New Year Cake 2022: న్యూఇయర్ కోసం ఇంట్లోనే మ్యాంగో చీజ్ కేక్ తయారీ ఎలానో తెలుసా?

సీన్‌ అబాట్‌ పట్టిన స్టన్నింగ్‌ క్యాచుకు క్రిస్‌ లిన్‌ (Chris Lynn) షాక్‌ తిన్నాడు. అసలు నేను ఔటయ్యానా అనే సందేహం కలిగేలా పేస్ పెట్టాడు. ఆపై తేరుకుని నిరాశగా పెవిలియన్‌ చేరాడు. స్టార్ ఓపెనర్ అయిన లిన్‌ 2 పరుగుకే ఔట్ అవ్వడంతో సిడ్నీ సిక్సర్స్‌ ప్లేయర్స్ సంబరాలు చేసుకున్నారు. అబాట్‌ క్యాచ్‌ని చూసి మైదానంలో ఉన్న ప్రతి ఆటగాడు ఆశ్చర్యపోయాడు. దీనికి సంబంధించిన వీడియోనూ బిగ్‌ బాష్‌ లీగ్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. 'క్యాచ్ ఆఫ్ ది సమ్మర్. క్రిస్‌ లిన్‌ ఇప్పటికీ నమ్మలేకపొతున్నాడు' అని బిగ్‌ బాష్‌ పేర్కొంది. ఈ వీడియోకి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. 

మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన బ్రిస్బేన్‌ హీట్‌ (Brisbane Heat) 19.1 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్‌ అయింది. డకెట్‌ (21), విల్డర్‌మత్‌ (27), మాక్స్‌ బ్రియాంట్‌ (22) పరుగులు చేశారు. సీన్‌ అబాట్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్‌ (Sydney Sixers) దారుణ ఆటతీరు కనబరిచింది. ఒక దశలో 100 లోపే ఆలౌట్‌ అయ్యేలా కనిపించింది. అయితే అబాట్‌ (Sean Abbott) 37 పరుగులు చేసి తన జట్టుకు విజయాన్ని అందించాడు. చివరి బంతికి సిడ్నీ విజయాన్ని అందుకుంది. 

Also Read: Bank holidays 2022: వచ్చే ఏడాది బ్యాంక్​ సెలవుల జాబితా ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News