Delhi Capitals captain Shreyas Iyer injured: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ ఫ్రాంచైజీ ఆటగాళ్లను గాయాలు వీడటం లేదు. స్పిన్నర్స్ రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, వికెట్ కీపర్, బ్యాట్స్‌మేన్ రిషబ్ పంత్, ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ( Ishant Sharma ) తరహాలోనే తాజాగా ఆ జట్టు కెప్టేన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ( Shreyas Iyer ) గాయం బారినపడ్డాడు. బుధవారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ( Rajasthan Royals ) జరిగిన మ్యాచ్‌లో 5వ ఓవర్ చివరి బంతికి బెన్ స్టోక్స్ ( Ben Stokes ) కొట్టిన ఓ షాట్‌ని ఫీల్డింగ్‌లో డైవ్ చేసి అడ్డుకోబోయిన శ్రేయాస్ అయ్యర్ అనుకోకుండా గాయపడ్డాడు. భుజం నొప్పితో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్‌కి వైద్య సహాయం అందించినా ఫలితం లేకపోయింది. దీంతో శ్రేయాస్ గ్రౌండ్ నుండి వైదొలగగా.. శిఖర్ ధావన్ ( Shikhar Dhawan ) జట్టు సారధి బాధ్యతలు తీసుకుని ముందుకు నడిపించాడు.
రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్ గెలిచిన అనంతరం మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా శ్రేయాస్ అయ్యర్ గాయం గురించి శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం అయ్యర్ భుజం గాయంతో బాధపడుతున్నాడని అన్నాడు. భుజం కదిలించగలుతున్నాడని చెప్పిన శిఖర్ ధావన్.. రేపు పూర్తి నివేధిక వచ్చే అవకాశం ఉందని తెలిపాడు. మ్యాచ్ ఫలితం గురించి మాట్లాడుతూ.. రాజస్థాన్ రాయల్స్‌ని కట్టడి చేసి జట్టును గెలిపించడంలో బౌలర్లు కీలకపాత్ర పోషించారని అభినందించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో కలిపి 298 రన్స్‌తో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన శ్రేయాస్ అయ్యర్ ఇలా గాయం బారిన పడటం ఆ జట్టుకు కచ్చితంగా ఇబ్బందికరమైన పరిణామమే. 42.57 సగటు, 135.45 స్ట్రైకింగ్ రేటుతో కొనసాగుతున్న శ్రేయాస్ ఈ గాయం కారణంగా జట్టుకు దూరమైతే, అది వారికి కొంత ప్రతికూల పరిణామమే అవుతుంది. మరోవైపు రిషబ్ పంత్ ( Rishabh Pant injury update ) పరిస్థితి చూస్తే.. ఈ నెల 17న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో అతడు పాల్గొనే పరిస్థితి ఇంకా కనిపించడం లేదు.
ఇదిలావుంటే, చివరిసారిగా అక్టోబర్ 7న జరిగిన ఓ ట్రైనింగ్ సెషన్‌లో గాయపడిన ఇషాంత్ శర్మ.. చివరకు అదే గాయం కారణంగా ఐపిఎల్ 2020 నుంచి నిష్క్రమించాల్సి ( Ishant Sharma ruled out of IPL 2020 ) వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe