Shubman to Musk to Buy Swiggy: స్విగ్గీని కొనండి.. మస్క్‌కు శుభ్‌మన్ సలహా

Shubman to Musk to Buy Swiggy:  స్విగ్గీని కొనుగోలు చేయాలంటూ క్రికెటర్ శుభ్‌మన్‌ .. బిలియనీర్ ఎలన్ మస్క్‌ను అభ్యర్థించడం నెట్టింట్లో వైరల్‌గా మారింది. శుభ్‌మన్‌ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 02:30 PM IST
  • మస్క్‌కు శుభ్‌మన్ గిల్ సలహా
  • స్విగ్గీని కొనండంటూ ట్వీట్
  • శుభ్‌మన్‌ ట్వీట్‌పై భిన్నాభిప్రాయలు
Shubman to Musk to Buy Swiggy: స్విగ్గీని కొనండి.. మస్క్‌కు శుభ్‌మన్ సలహా

Shubman to Musk to Buy Swiggy: స్విగ్గీని కొనండంటూ... టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కు ఉచిత సలహా ఇచ్చి ట్రోలర్స్‌కు చిక్కాడు భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్. దాంతో వారు ఓ ఆట ఆడుకుంటున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌ ట్విటర్ ను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఇటీవలే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అనేక మలుపుల తర్వాత ట్విటర్ ను మస్క్ చేజిక్కించుకున్నారు. దాంతో దీనిపై పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడిదే క్రమంలో శుభ్‌మన్ గిల్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది.  ఎలాన్ మస్క్..  ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని కొనుగోలు చేయండి. అప్పుడైనా సమయానికి ఫుడ్ డెలివరీ చేయగలంటూ ట్వీట్ చేశాడు. గతంలో ఫుడ్ డెలివరీ విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ట్వీట్ చేసినట్లు ఉన్నాడు శుభ్‌మన్‌.

అయితే అతడి ట్వీట్ పై స్విగ్గీ సంస్థ సైతం స్పందించింది. మేం సరి చూసుకునేందుకు మీ ఆర్డర్ వివరాలు పంపండంటూ ట్వీట్ చేసింది. దానికి శుభ్ మన్ ఆ వివరాలు పంపడం .. అవి అందాయని స్విగ్గీ ధృవీకరిస్తూ ట్వీట్ చేయడం జరిగిపోయాయి.. అయితే శుభ్‌మన్ ట్వీట్‌పై నెటిజనులు మాత్రం ఘాటుగా స్పందిస్తున్నారు. ఓ రోజు డెలివరీ బాయ్‌గా పని చేయండి అప్పుడైనా వారి కష్టాలు తెలుస్తాయంటూ కొందరు ట్వీట్ చేశారు. టీ20 క్రికెట్‌లో మీరు చేస్తున్న బ్యాటింగ్‌ కంటే మేం ఇంకా వేగంగానే ఉన్నాం అంటూ ఇంకొకరు ఘాటుగా బదులిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 టోర్నీలో శుభ్‌మన్ గిల్ గుజరాత్ తరుపున ఆడుతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 229 పరుగులు చేశాడు.
 

Also Read: Ramya Murder Case Verdict: దిశ చట్టం పవర్ ఇదే..21 రోజుల్లోనే ఉరిశిక్ష విధించొచ్చు..రోజా సంచలన వ్యాఖ్యలు

Also read:Face Care Tips: ముఖంపై మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ 5 రకాల పుడ్స్ తో చెక్ పెట్టండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News