ICC Rankings: టాప్-10లో ఐదుగురు భారత ఆటగాళ్లు.. కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించిన శుభ్‌మన్ గిల్..

ICC Rankings: ఈసారి ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్ ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటర్లు జాబితాలో ముగ్గురు, బౌలర్లు జాబితాలో ఇద్దరు చోటు దక్కించుకున్నారు. వారెవరంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 13, 2023, 05:11 PM IST
ICC Rankings: టాప్-10లో ఐదుగురు భారత ఆటగాళ్లు.. కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించిన శుభ్‌మన్ గిల్..

ICC ODI Rankings 2023: ఆసియా కప్‌లో టీమిండియా క్రికెటర్లు అదరగొడుతున్నారు. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ టీమిండియా ప్లేయర్లు సత్తా చాటారు. భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కెరీర్ లో బెస్ట్ ర్యాంకును సాధించాడు. ఆసియా కప్‌లో నేపాల్, పాకిస్థాన్‌లపై హాఫ్ సెంచరీలు సాధించడంతో అతడు వన్డే ర్యాంకింగ్స్‌లో 2వ స్థానానికి ఎగబాకాడు. ఇంతకముందు గిల్ మూడో స్థానంలో ఉండేవాడు. 

ఈసారి ర్యాంకింగ్స్ లో ముగ్గురు భారత ఆటగాళ్లకు చోటు లభించింది. గిల్ తోపాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా మెుదటి పది మందిలో చోటు సంపాదించుకున్నారు. రోహిత్ 8, కోహ్లి 9వ ర్యాంకులో ఉన్నారు. బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 2019 తర్వాత టాప్ 10లో ముగ్గురు ఇండియన్ బ్యాటర్లు ఉండటం ఇదే తొలిసారి.

టాప్-10 బ్యాటర్లు: 
బాబర్ ఆజం (పాకిస్తాన్)- 863 రేటింగ్ పాయింట్లు
శుభమాన్ గిల్ (ఇండియా) – 759 రేటింగ్ పాయింట్లు
రస్సీ వాండర్ డస్సెన్ (దక్షిణాఫ్రికా)- 745 రేటింగ్ పాయింట్లు
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 739 రేటింగ్ పాయింట్లు
ఇమామ్-ఉల్-హక్ (పాకిస్తాన్)- 735 రేటింగ్ పాయింట్లు
హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్) – 726 రేటింగ్ పాయింట్లు
క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా)- 721 రేటింగ్ పాయింట్లు
విరాట్ కోహ్లీ (ఇండియా)- 715 రేటింగ్ పాయింట్లు
రోహిత్ శర్మ (ఇండియా)- 707 రేటింగ్ పాయింట్లు
ఫఖర్ జమాన్ (పాకిస్తాన్)- 705 రేటింగ్ పాయింట్లు

టీమిండియా బ్యాటర్లుతోపాటు బౌలర్లు కూడా ర్యాంకింగ్స్ లో దుమ్ముదులిపారు. ఈసారి ఈ జాబితాలో ఇద్దరు బౌలర్లకు చోటు లభించింది. పాకిస్తాన్, శ్రీలంక జట్లపై అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 7వ స్థానానికి చేరుకున్నాడు. మరో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఐసీసీ బౌలర్ల టాప్-10 ర్యాంకింగ్స్ లో  ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 

టాప్-10 బౌలర్లు: 
జోష్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 692 పాయింట్లు
మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)- 666 పాయింట్లు
ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్)- 666 పాయింట్లు
ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా)- 663 పాయింట్లు
మాట్ హెన్రీ (న్యూజిలాండ్)- 658 పాయింట్లు
ముజీబ్ ఉర్ రెహ్మాన్ (ఆఫ్ఘనిస్తాన్)- 657 పాయింట్లు
కుల్దీప్ యాదవ్ (భారతదేశం)- 656 పాయింట్లు
రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్)- 655 పాయింట్లు
మహ్మద్ సిరాజ్ (భారతదేశం)- 643 పాయింట్లు
షాహీన్ అఫ్రిది (పాకిస్తాన్)- 635 పాయింట్లు

Also Read: Rohit Sharma: 10 వేల క్లబ్‌లో రోహిత్ శర్మ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News