స్టీవెన్ స్మిత్ పై రాజస్థాన్ రాయల్స్ మోజు..!

ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవెన్ స్మిత్‌ను మళ్లీ తమ టీమ్ తరఫున ఐపీఎల్‌లో ఆడించడానికి సిద్ధమవుతోంది రాజస్థాన్ రాయల్స్ జట్టు.

Last Updated : Jan 5, 2018, 03:03 PM IST
స్టీవెన్ స్మిత్ పై రాజస్థాన్ రాయల్స్ మోజు..!

ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవెన్ స్మిత్‌ను మళ్లీ తమ టీమ్ తరఫున ఐపీఎల్‌లో ఆడించడానికి సిద్ధమవుతోంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. 2014, 2015 సంవత్సరాల్లో రాజస్థాన్ రాయల్స్‌కి ఆడిన స్మిత్ మరల అదే టీమ్ తరఫున తన లక్‌ను ఐపీఎల్‌లో  పరీక్షించుకోనున్నాడు. ఇప్పటికి 69 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన స్మిత్ 37.02 యావరేజ్‌తో 1703 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.

గత ఐపీఎల్‌లో మాత్రం రైజింగ్ పూణె జెయింట్ జట్టుకి ఆడిన స్మిత్ మళ్లీ రాయల్స్ వద్దకే రావడం విశేషం. కాగా స్మిత్ రాకను తాము స్వాగతిస్తున్నామని ఇప్పటికే రాయల్స్ డైరెక్టర్ జుబిలన్ బరూచా ప్రకటించారు. అయితే రాయల్స్ స్మిత్‌ను ఆడించడానికి ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతోందన్న విషయంపై ఇంకా ఎలాంటి వార్తలు రాలేదు.

Trending News