Sunrisers Hyderabad All Rounder Washington Sundar injured again: ఐపీఎల్ 2022లో వరుస ఓటములను ఎదుర్కొంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ రెండో సారి గాయపడ్డాడు. ఆదివారం (మే 1) చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు సుందర్ కుడి చేతికి గాయమైంది. గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్ టామ్ మూడీ పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2022లో వాషింగ్టన్ సుందర్ గాయపడడం ఇది రెండోసారి. ఈ సీజన్ ఆరంభంలో కుడి చేతి వెలి గాయం కారణంగా సుందర్ మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇటీవల గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుందర్ తిరిగి వచ్చాడు. గత రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అదే కుడి చేతి వెలికి గాయమైంది. దాంతో మరోసారి అతడు జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు ఒక్క బంతి కూడా బౌలింగ్ చేయలేదు. ఇక బ్యాటింగ్‌కి దిగి 2 బంతుల్లో రెండు పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
4️⃣ overs. Just 2️⃣2️⃣ runs conceded. The Riser of the Day Award went to @BhuviOfficial for an excellent spell with the new ball and at the death 🧡#SRHvCSK #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/GSlKZS6NWV
— SunRisers Hyderabad (@SunRisers) May 2, 2022
'మరోసారి వాషింగ్టన్ సుందర్ కుడి చేతికి గాయం అవడం దురదృష్టకరం. గాయం పూర్తిగా నయమైనా.. మళ్లీ అక్కడే బంతి తగిలింది. ప్రస్తుతం సుందర్ బౌలింగ్ పరిస్థితిలో లేడు. అయితే అతడికి బ్యాండేజ్ వేసే అంత గాయం మాత్రం కాలేదు. తదపరి మ్యాచ్‌కు సుందర్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.అదే జరిగితే జట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే అతడు మా జట్టులో కీలక బౌలర్‌లలో ఒకడు' అని ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్ టామ్ మూడీ తెలిపాడు.
Also Read: SVP Trailer Record: రికార్డులు బద్దలు కొట్టిన 'సర్కారు వారి పాట' ట్రైలర్.. అర్ధ గంటలోనే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook