New Zealand vs Pakistan 1st Semi Final Playing 11 is Out: టీ20 ప్రపంచకప్ 2022 తొలి సెమీ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు మరికొద్దిసేపట్లో తలపడనున్నాయి. సిడ్నీ మైదానంలో మరో అర్ధ గంటలో మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని కేన్ మామ చెప్పాడు. మరోవైపు తాము కూడా ఎలాంటి మార్పులు చేయలేదని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు.
గతేడాది రన్నరప్ అయిన న్యూజిలాండ్ ఈసారి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు సెమీస్ గండం గట్టెక్కి తుది మెట్టుకు చేరుకోవాలని పాకిస్తాన్ ఉవ్విళ్లూరుతోంది. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో రసవత్తరపోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. మరోవైపు డిస్ని ప్లస్ హాట్ స్టార్‌లో కూడా లైవ్ వస్తుంది.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య 28 మ్యాచ్‌లు జరగగా.. 17 మ్యాచ్‌ల్లో పాక్ గెలుపొందింది. 11 మ్యాచ్‌ల్లో కివీస్ విజయం సాధించింది. ప్రపంచకప్‌లలో 11 సార్లు సెమీ ఫైనల్ చేరిన కివీస్.. మూడుసార్లు మాత్రమే గెలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌లో (1992, 1999, 2007 ) పాకిస్తాన్ గెలిచింది.
New Zealand have opted to bat against Pakistan in semi-final 1 at the SCG 🏏
Who are you cheering for?#T20WorldCup | #NZvPAK | 📝: https://t.co/LSzHXLy12f pic.twitter.com/xxZU1IbmTe
— ICC (@ICC) November 9, 2022
తుది జట్లు:
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
పాకిస్థాన్: మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజామ్ (కెప్టెన్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది.
Also Read: Rohit Sharma: సెమీస్‌కు ముందు ఆ ప్లేయర్‌కు బిగ్ రిలీఫ్.. రోహిత్ శర్మ సపోర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook