Harbhajan Singh feels Hardik Pandya New Captain and Ashish Nehra Coach for India: టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైన భారత్ ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. సెమీస్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాభవంను ఎదుర్కొంది. కచ్చితంగా ఫైనల్ చేరుతుందనుకున్న భారత్.. ఇలా కనీస పోటీ ఇవ్వకుండా టోర్నీ నుంచి నిష్కమించడంతో టీమిండియా ఫాన్స్ నిరాశ చెందారు. భారత జట్టు ఆటగాళ్లతో పాటుగా మేనేజేమెంట్‌పై కూడా సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై మాజీలు, నెటిజన్లు మండిపడుతున్నారు.
టీ20 ప్రపంచకప్ 2022లో రోహిత్ శర్మ పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. ఒక్క మ్యాచులో కూడా సరైన ఓపెనింగ్ ఇవ్వలేదు. పవర్ ప్లేలో ఆచితూచి ఆడి ఔట్ అవడంతో.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పడింది. దాంతో భారత్ భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. మెగా టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ కేవలం 116 పరుగులు మాత్రమే చేశాడు. అటు కెప్టెన్సీలో కూడా విఫలమయ్యాడు. ముఖ్యంగా సెమీస్ మ్యాచులో ఇంగ్లండ్ బ్యాటర్లు చెలరేగుతుంటే ఏమీ చేయలేకపోయాడు. దాంతో రోహిత్‌ను వెంటనే కెప్టెన్సీ తప్పించాలని భారత అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
భారత జట్టుతో పాటు కోచింగ్ స్టాఫ్‌లో కూడా మార్పులు చేసే సమయం ఆసన్నమైందని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఇండియా టుడేతో హర్భజన్ మాట్లాడుతూ... 'రాహుల్ ద్రవిడ్ చాలా తెలివైనవారు. ఇద్దరం కలిసి చాలాకాలం క్రికెట్ ఆడాం. కానీ టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు ఇటీవలే రిటైరైన వ్యక్తి కోచ్‌గా కావాలి. వారే టీ20 ఫార్మాట్‌ను అర్ధం చేసుకోగలరు. ద్రవిడ్‌ను భారత జట్టు కోచ్‌గా తొలగించకూడదనుకుంటే.. ఇటీవల రిటైర్ అయిన వ్యక్తిని అసిస్టెంట్‌గా ఎంపిక చేయాలి' అని అన్నాడు.
'ఆశిష్ నెహ్రా లాంటి మాజీ ఆటగాడిని భారత కోచింగ్ స్టాఫ్‌లో భాగం చేయండి. నెహ్రాది గొప్ప క్రికెట్ మైండ్. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్‌ను విన్నర్‌గా నిలిపాడు. నెహ్రా జట్టుతో కలిస్తే యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తాడు. టీ20ల్లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేస్తే బాగుటుందని నేను అనుకుంటున్నా. ప్రస్తుత జట్టులో అత్యుత్తమ ఆటగాడు హార్దిక్. అతడి లాంటి ఆటగాళ్లు భారత జట్టుకు చాలా అవసరం'అని హర్భజన్ సింగ్ చెప్పాడు.
Also Read: Rakul Preet Singh Pics: షర్ట్ లెస్ ప్యాంట్‌సూట్‌లో.. జిగేల్ మనిపిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్!
Also Read: Ashu Reddy Hot Pics: టైట్ బ్లాక్ డ్రెస్‌లో అషు రెడ్డి.. క్లీవేజ్ షోతో హీటు పెంచేస్తున్న తెలుగమ్మాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook