Lalit Modi Biopic: ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీపై త్వరలో బయోపిక్

Lalit Modi Biopic: ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా ఐపీఎల్ హల్‌చల్ చేస్తోంది. దేశంలో ఐపీఎల్ ప్రారంభమై అప్పుడే 15 ఏళ్లు..ఇంతకీ ఐపీఎల్ సృష్టికర్తపై ఇప్పుడు త్వరలో బయోపిక్ రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 19, 2022, 10:29 AM IST
  • ఐపీఎల్ సృష్టికర్తగా లలిత్ మోడీ బయోపిక్ త్వరలో
  • ప్రముఖ రచయిత బోరియా రాసిన పుస్తకం ఆధారంగా సినిమా
  • 83 సినిమా, తలైవి నిర్మాత ఇందూరి విష్ణు
Lalit Modi Biopic: ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీపై త్వరలో బయోపిక్

Lalit Modi Biopic: ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా ఐపీఎల్ హల్‌చల్ చేస్తోంది. దేశంలో ఐపీఎల్ ప్రారంభమై అప్పుడే 15 ఏళ్లు..ఇంతకీ ఐపీఎల్ సృష్టికర్తపై ఇప్పుడు త్వరలో బయోపిక్ రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతో ప్రారంభమై అనతికాలంలోనే విశేష ప్రాచుర్యం సంపాదించుకున్న టోర్నీ ఐపీఎల్ టీ20. దేశంలో ఇప్పుడుత పది ఫ్రాంచైజీలు వచ్చేశాయి. ఐపీఎల్ సీజన్ 15 నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీపై బయోపిక్ రానుందనే వార్త చర్చనీయాంశమవుతోంది. తమిళ మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ తలైవి, 1983 ప్రపంచకప్ విజేతగా ఇండియా నిలిచిన వైనంపై 83 బయోపిక్ సినిమాలను నిర్మించిన విష్ణు ఇందూరి ఈ బయోపిక్‌కు తెరతీయనున్నారు. ప్రముఖ రచయిత, పాత్రికేయుడైన బోరియా మజుందార్ రచించిన మావెరిక్ కమీషనర్ ది ఐపీఎల్ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. 

ఐపీఎల్‌కు వాస్తవంగా స్ఫూర్తి ఎవరు

అయితే వాస్తవంగా ఐపీఎల్ సృష్టించింది లలిత్ మోడీనేనా అంటే కాదనే సమాధానం వస్తుంది చరిత్ర తెలిసినవారెవరికైనా. వాస్తవానికి ఐపీఎల్ అనేది స్వతహాగా వచ్చిన ఆలోచన కాదు. జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఫౌండర్, రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్ర ఆలోచనతో రూపుదిద్దుకున్న ఇండియన్ క్రికెట్ లీగ్ అంటే ఐసీఎల్‌కు కాపీ ఐపీఎల్ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 2007, 2009లో ఐసీఎల్ రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. టీ20 ఫార్మట్‌లో జరిగిన ఐసీఎల్‌కు వివిధ కారణాలతో బీసీసీఐ, ఐసీసీ మద్దతు లభించలేదు. ఆ తరువాత బీసీసీఐ స్వయంగా 2008లో ఐపీఎల్ లాంచ్ చేసింది. 

బీసీసీఐ ఐపీఎల్ లాంచ్ తరువాత సహజంగానే ప్రాచుర్యం పొందింది. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న లలిత్ మోడీకు కీర్తి దక్కింది. లలిత్ మోడీపై రచించిన ఈ పుస్తకం ఏప్రిల్ 20న మార్కెట్‌లో విడుదల కానుంది.లలిత్ మోడీ విజనరీ ఐపీఎల్, క్రికెట్ లీగ్ ఎలా ప్రారంభమైంది, లలిత్ మోడీ చిక్కుల్లో ఎందుకు పడ్డారు వంటి అంశాలు పుస్తకంలో ఉన్నాయని రచయిత, ప్రముఖ పాత్రికేయుడు బోరియా తెలిపారు. దేశం వదిలి విదేశాలకు పారిపోయిన లలిత్ మోడీ చేసింది తప్పా ఒప్పా అనేది సినిమాలో చూపించమంటున్నారు నిర్మాత విష్ణు ఇందూరి. కేవలం లలిత్ మోదీ కధ మాత్రం సినిమాలో ఉంటుందన్నారు. 

Also read: RR vs KKR: ఐపీఎల్ 2022లో మరో అద్భుతం, ప్యాట్ కమ్మిన్స్, శివమ్ మావిల అద్భుత ఫీట్, గ్రేట్ క్యాచ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News