Netizens trolls rift between Rohit Sharma-Virat Kohli: భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొందరు ప్లేయర్స్, బీసీసీఐ సెలెక్టర్లు ఎవరికివారే యమునాతీరులా వ్యవహరిస్తున్నారు. బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కూడా ఎలాంటి వివరణ ఇచ్చుకొని పరిస్థితి వచ్చింది. ఇందుకు కారణం తాజాగా బీసీసీఐ సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంగా టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli)ని ఎలాంటి సమాచారం లేకుండా వన్డే కెప్టెన్‌గా కూడా తొలగించి.. రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఆ బాధ్యతలు అప్పగించింది. దాంతో టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య మళ్లీ ఇగో ప్రాబ్లమ్స్ మొదలయ్యాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
2019లో మొదలు:
సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనీ కెప్టెన్‌లుగా ఉన్నపుడు భారత జట్టులో ఎలాంటి విభేదాలు తలెత్తలేదు. చిన్నచిన్నవి వచ్చినా అక్కడితోనే ముగిసేవి. ముఖ్యంగా మహీ 2007లో జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత టీమిండియా జట్టు రాతే మారిపోయింది. 2018 వరకు అంతా బాగానే సాగింది. 2019 వన్డే ప్రపంచకప్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడ్డాయని నెట్టింట వార్తలు షికారు చేశాయి. మైదానంలోని వీరి ప్రవర్తన కూడా ఈ వాదనకు బలం చేకూర్చింది. అంతేకాదు ఇన్‌స్టాలో కోహ్లీని రోహిత్, అతని సతీమణి రితికఅన్ ఫాలో చేయడం.. ఆ తర్వాత అనుష్క శర్మ వారిని అన్ ఫాలో చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read: Samantha item song: వివాదంలో సమంత ఐటెం సాంగ్-పాటను నిషేధించాలంటూ హైకోర్టుకు..
రోహిత్ గురించి తెలియదు:
ఐపీఎల్ 2020 సందర్బంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Kohli vs Rohit) లు ఒకరినొకరు చూసుకోకపోవడం.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే ముందు రోహిత్ గాయం గురించి తనకు తెలియదని విరాట్ మీడియాకు తెలపడం అనేక ఊహాగానాలకు తెరదీసింది. ఆపై ఇంగ్లండ్ పర్యటన, ఐపీఎల్ 2021, టీ20 ప్రపంచకప్ 2021లో వీరిద్దరూ ఒకరికొకరు సన్నిహితంగా ఉన్నారు. కోహ్లీ మైదానంలో రోహిత్ సలహాలు తీసుకున్నాడు. దాంతో ఈ ఇద్దరి మధ్య మళ్లీ స్నేహం కుదిరిందని అభిమానులంతా భావించారు. ఇక టీ20 ప్రపంచకప్ అనంతరం సారథ్య బాధ్యతలను విరాట్ వదులుకోవడంతో.. రోహిత్‌కు బీసీసీఐ బాధ్యతలు అప్పగించింది. మెగా టోర్నీ అనంతరం కోహ్లీ రెస్ట్ తీసుకోగా.. రోహిత్ సారథిగా న్యూజిలాండ్ టీ20 సిరీస్ ఆడాడు. ఆపై రెండు టెస్ట్‌ల సిరీస్ నుంచి రోహిత్ రెస్ట్ తీసుకున్నాడు.
కోహ్లీకి బీసీసీఐ భారీ షాక్:
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందే విరాట్ కోహ్లీకి బీసీసీఐ భారీ షాకిచ్చింది. కోహ్లీని వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి రోహిత్ శర్మకు అప్పగించింది. కోహ్లీకి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడాన్ని అవమానంగా భావించిన కోహ్లీ.. దక్షిణాఫ్రికా పర్యటనలోని వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. తన కూతురు వామికా మొదటి బర్త్‌డే సెలెబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో హాలిడే ట్రిప్‌కు వెళ్తున్నానని బీసీసీఐకి సమాచారమిచ్చినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు టెస్టులకు రోహిత్ శర్మ దూరమయ్యాడని బీసీసీఐ ప్రకటించింది.
Also Read: Telangana MLC Election: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్
దేశం తరఫున ఆడడం కోసం ఇంత ఇగో నా:
ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే.. భారత క్రికెట్ (Indian Cricket) జట్టులో ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దాంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు (Rohit Sharma-Virat Kohli Rift) నెలకొన్నాయని సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. 'నీ కెప్టెన్సీలో నేనెందుకు ఆడుతా అని కోహ్లీ, రోహిత్ తప్పుకుంటున్నారు' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'భారత జట్టులో మళ్లీ ఇగో ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి' అని ఇంకొకరు ట్వీటారు. 'దేశం తరఫున ఆడడం కోసం ఇంత ఇగో నా', 'గంగూలీ సర్.. ఈ సమస్యను త్వరగా పరిష్కరించండి, భారత క్రికెట్‌కు మంచిది కాదు', 'ఇది టీమిండియాకు మంచిది కాదు' అని కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Rohit not in test...Kohli not in ODI..
This is not good for team. https://t.co/vl2FqGWHDh
— ABHISHEK ANAND 🇮🇳 (@RealAnand_01) December 14, 2021
I heard kohli not keen to play ODI'S against SA
what the hell is happening here!!!!@SGanguly99 plz sort out the issue...not good for indian cricket sir...— Darshan (@deekuonfire) December 14, 2021
dressing room mein toh ekta kapoor ka show chal raha hai itna drama🤣😂rohit doesn't want to play tests kohli doesn't want to play odi's
Best is dono ko team se nikaal do for having so much ego before playing for the country we hv abundance of talent— advi (@ishq_bahara) December 14, 2021
December 14, 2021— Shouvik_Banerjee 🕉️🔱🏆🙏🇮🇳🏏🧡💙🎤💻🎸🎭 (@Valar_Doharis)
Cannot play ODI series with South Africa because of Personal Reasons: Virat Kohli after being dropped as Captain🤔