ఆకట్టుకుంటున్న క్రికెట్ వరల్డ్ కప్ 2019 ప్రమోషనల్ వీడియో

వరల్డ్ కప్ వచ్చే ఏడాది మే 30 నుంచి జూలై 14 వరకు ఇంగ్లండ్‌ వేల్స్‌ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే.

Updated: Aug 8, 2018, 02:30 PM IST
ఆకట్టుకుంటున్న క్రికెట్ వరల్డ్ కప్ 2019 ప్రమోషనల్ వీడియో

వరల్డ్ కప్ వచ్చే ఏడాది మే 30 నుంచి జూలై 14 వరకు ఇంగ్లండ్‌ వేల్స్‌ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రికెట్  సంగ్రామం కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వరల్డ్ కప్ 2019 కోసం ప్రత్యకంగా రూపొందించిన ఓ ప్రమోషనల్‌ వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకొంటోంది. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ లీడ్‌ రోల్‌లో రూపొందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఈ ప్రమోషనల్ వీడియాలో ఫ్లింటాఫ్‌ ‘ప్రపంచకప్‌ వచ్చేస్తోంది’ అని న్యూస్‌ పేపర్‌లో చూసి సంతోషంతో విజిల్ వేస్తూ.. కొంత మందితో కలిసి గల్లీల్లో తిరుగుతూ.. పాడుతూ డ్యాన్స్ చేశాడు. ఈ వీడియాలో ఫ్లింటాఫ్‌తో పాటు శ్రీలంక మాజీ క్రికెటర్‌ కుమార సంగక్కర, మహిళా క్రికెటర్‌ చార్లొటె ఎడ్వర్డ్స్‌, ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ ఫిల్‌ టఫ్‌నెల్‌లు కూడా ఉన్నారు. ‘ఆన్‌ టాప్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’  అంటూ ఫ్లింటాఫ్‌ పాడుతుండగా.. వివిధ దేశాల జెండాలతో క్రికెట్ అభిమానులు అతని వెంట నడుస్తూ చిందేశారు. ఈ వీడియోను ‘ఐసీసీ’ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.