నాగ్‌పూర్‌లో జరుగుతున్న భారత్-శ్రీలంక రెండో టెస్టులో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తన బ్యాటింగ్‌తో శ్రీలంకకు ముచ్చెమటలు పట్టిస్తూనే.. అనేక రికార్డులను తిరగరాశాడు. డబుల్ సెంచరీ, 19వ టెస్ట్ సెంచరీ ఇలా ఒకటేమిటీ అనేక రికార్డులను నాగ్‌పూర్ టెస్ట్ మ్యాచ్‌తో పటాపంచలు చేసాడు. ఇంతకీ ఆ రికార్డులు ఏమిటంటే..
* ఈ టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ
* 19వ టెస్ట్ సెంచరీ
* 5వ డబుల్ సెంచరీ
* వేగవంతంగా సెంచరీ పూర్తిచేసిన కెప్టెన్‌గా ఐదవ స్థానం
ఈ జాబితాలో అతను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను కూడా వెనక్కు నెట్టేశాడు. విరాట్ కోహ్లీ 104 ఇన్నింగ్స్‌లో 19 టెస్టు సెంచరీలను పూర్తి చేశాడు. దీనికి ముందు, సచిన్ 105 ఇన్నింగ్స్‌లో 19 సెంచరీలను చేసాడు.
ఈ మ్యాచ్లో విరాట్ డబుల్ సెంచరీ సాధించాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో ఐదవ డబుల్ సెంచరీ. ఒక కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన కోహ్లీ .. వెస్ట్ ఇండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా సరసన చేరాడు. కెప్టెన్‌గా లారా 5 డబుల్ సెంచరీలు చేశాడు.
కెప్టెన్గా 200 కంటే ఎక్కువ స్కోరు సాధించినవారు
1. విరాట్ కోహ్లీ - 5 సెంచరీలు
2. బ్రియన్ లారా - 5 సెంచరీలు
3. డాన్ బ్రాడ్మాన్ - 4 సెంచరీలు
4. మైఖేల్ క్లార్క్ - 4 సెంచరీలు
5. గ్రేమ్ స్మిత్ - 4 సెంచరీలు
వేగవంతంగా 19 టెస్ట్ సెంచరీలు పూర్తిచేసిన బ్యాట్స్‌మెన్లు
1. సర్ డాన్ బ్రాడ్ మన్ (ఆస్ట్రేలియా) - 53 ఇన్నింగ్స్
2. సునీల్ గవాస్కర్ (ఇండియా) - 85 ఇన్నింగ్స్
3. మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా) - 94 ఇన్నింగ్స్
4. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) - 97 ఇన్నింగ్స్
5. విరాట్ కోహ్లి (ఇండియా) - 104 ఇన్నింగ్స్
6. సచిన్ టెండూల్కర్ (ఇండియా) - 105 ఇన్నింగ్స్ లు
టెస్టుల్లో అనేక సెంచరీలు పూర్తిచేసిన విరాట్ కోహ్లీ సునీల్ గవాస్కర్‌ను విడిచిపెట్టలేదు. కెప్టెన్‌గా సునీల్ గవాస్కర్ 74 ఇన్నింగ్స్‌లో.. 11 టెస్ట్ సెంచరీలు చేస్తే.. అదే సమయంలో, విరాట్ కోహ్లీ 49 ఇన్నింగ్స్‌లో 12 టెస్ట్ సెంచరీలు చేశాడు మరియు సునీల్ గవాస్కర్‌ను వెనక్కు నెట్టేశాడు.
అత్యధిక సెంచరీలు సాధించిన భారతీయ కెప్టెన్లు
1. విరాట్ కోహ్లీ - 12 వ సెంచరీ, 49 ఇన్నింగ్స్
2. సునీల్ గవాస్కర్ - 11 సెంచరీలు, 74 ఇన్నింగ్స్
3. మహమ్మద్ అజారుద్దీన్ - 9 సెంచరీలు, 68 ఇన్నింగ్స్
4. సచిన్ టెండూల్కర్ - 7 సెంచరీలు, 43 ఇన్నింగ్స్
మాజీ ఆస్ట్రేలియన్ కెప్టెన్ రికీ పాంటింగ్, మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ రికార్డును కోహ్లీ బ్యాటింగ్‌తో పగులగొట్టాడు. కెప్టెన్గా కోహ్లీ ఈ క్యాలెండర్ ఇయర్లో పది సెంచరీలు చేశాడు. పాంటింగ్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో (2005-06) 9 సెంచరీలుగా నమోదుచేశాడు. స్మిత్ కూడా ఒక క్యాలెండర్ ఇయర్‌లో అన్నే సెంచరీలు నమోదుచేశాడు.
క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్లు
1. విరాట్ కోహ్లీ - 10 సెంచరీలు (2017)
2. రికీ పాంటింగ్ - 9 సెంచరీలు (2005)
3. గ్రేమ్ స్మిత్ - 9 సెంచరీలు (2005)
4. రికీ పాంటింగ్ - 9 సెంచరీలు (2006)
26th November 2000 in Nagpur:
SACHIN TENDULKAR scored the Test cricket's 200th DOUBLE HUNDRED.26th November 2017 in Nagpur:
VIRAT KOHLI scores the 50th Test DOUBLE HUNDRED by an Indian.#INDvSL— Sampath Bandarupalli (@SampathStats) November 26, 2017
విరాట్ కోహ్లీ 5వ డబుల్ సెంచరీ