T20 World Cup 2022: 'భారత్ ను ఓడిస్తే ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటా': పాక్ నటి

T20 World Cup 2022: భారత్-జింబాబ్వే మ్యాచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది పాక్ నటి సెహర్ షిన్వారీ. ఈ మ్యాచ్ లో జింబాబ్వే టీమిండియాను ఓడిస్తే ఆ దేశపు వ్యక్తిని పెళ్లిచేసుకుంటానని చెప్పింది.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2022, 06:51 AM IST
T20 World Cup 2022: 'భారత్ ను ఓడిస్తే ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటా': పాక్ నటి

T20 World Cup 2022, IND VS ZIM: టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశలో భాగంగా.. భారత్ తన చివరి మ్యాచ్ లో జింబాబ్వేను (India vs Zimbabwe) ఢీకొంటుంది. ఈ మ్యాచ్ మెల్‌బోర్న్ నవంబర్ 06, ఆదివారం నాడు జరగనుంది. తాజాగా ఈ మ్యాచ్ పై పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ (Pakistani actress Sehar Shinwari) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మ్యాచ్ లో భారత్‌ను ఓడిస్తే.. తాను జింబాబ్వే వ్యక్తిని పెళ్లిచేసుకుంటానని చెప్పింది. ఈ మేరకు ట్వీట్ కూడా చేసింది.

''తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు అద్భుతంగా భారత్‌ను ఓడించినట్లయితే నేను ఆ దేశపు వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను'' అని షిన్వారీ ట్వీట్ చేసింది. గతంలో కూడా ఈ నటి భారత జట్టుపై తన అక్కసును వెళ్లగక్కింది. స్వదేశంలో ఆసీస్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయినప్పడు ఈ అమ్మడు భారత జట్టుపై విమర్శలు చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ రేంజ్ లో ఆమెపై విరుచుకుపడుతున్నారు. 

రీసెంట్ గా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ఒక్క పరుగుతో తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.  మెుదట బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో  8 వికెట్లకు 129 పరుగులు మాత్రమే చేయగలిగింది పాక్. దీంతో ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే సంచలన విజయాన్ని నమోదు చేసింది.

Also Read: PAK vs SA: దక్షిణాఫ్రికాపై విజయం.. పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News