టెస్టుల్లో విరాట్ 21వ సెంచరీ

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌లో తన 21వ సెంచరీని నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో జరిగిన రెండో టెస్టులో ఆయన ఈ రికార్డు సాధించాడు. 

Last Updated : Jan 15, 2018, 04:13 PM IST
టెస్టుల్లో విరాట్ 21వ సెంచరీ

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌లో తన 21వ సెంచరీని నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో జరిగిన రెండో టెస్టులో ఆయన ఈ రికార్డు సాధించాడు. 146 బంతుల్లో 10 ఫోర్లు కొట్టి సెంచరీ నమోదు చేసిన కోహ్లీకి ఇది దక్షిణాఫ్రికాపై రెండో శతకం కావడం విశేషం. 2013లో జోహన్స్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ దక్షిణాఫ్రికాపై 119 పరుగులు చేశాడు. తాజా టెస్టులో 141 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అలాగే దక్షిణాఫ్రికాపై ఈ రికార్డు నమోదు చేసిన రెండో బ్యా్ట్స్‌మన్ కూడా కోహ్లీయే కావడం గమనార్హం. అదే రికార్డు సాధించిన మొదటి బ్యాట్స్‌మన్‌గా సచిన్ టెండుల్కర్‌ని చెప్పుకోవచ్చు. అయితే టెస్టు కెరీర్‌లో వేగంగా 21వ సెంచరీ బ్యాట్స్‌మన్ల జాబితాలో కోహ్లీ నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మొదటి మూడు స్థానాల్లో డ్రాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా), సునీల్ గవాస్కర్ (భారత్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) ఉండడం విశేషం. అయితే ఇదే జాబితాలో భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండుల్కర్ అయిదవ స్థానంలో నిలవడం గమనార్హం.

Trending News