ఇండియా vs సౌతాఫ్రికా 4వ వన్డే: టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ

Last Updated : Feb 10, 2018, 07:42 PM IST
ఇండియా vs సౌతాఫ్రికా 4వ వన్డే: టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ

ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న 4వ వన్డేలో టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా ప్రస్తుతం 3.0 ఆధిక్యంతో వుంది. ఇవాళ జరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే, ఇక వన్డే సిరీస్ టీమిండియా సొంతమైనట్టే. అదే కానీ జరిగితే, తొలిసారిగా భారత్‌కి సౌతాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన విజయాన్ని అందించిన కెప్టేన్‌గా విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్ చేరుతుంది.

 

అయితే, అదే సమయంలో ఆతిధ్య జట్టు సౌతాఫ్రికా సైతం గత మూడు మ్యాచ్‌ల్లో ఓటమి ఎదుర్కున్న కసితో వుంది. ఈ మ్యాచ్‌లోనూ ఓటమిపాలైతే సిరీస్ కోల్పోవడమే కాకుండా తమ సొంత గడ్డపై భారత జట్టుని ఓడిస్తూ వస్తున్న అరుదైన రికార్డుని చేజారిన వాళ్లం అవుతాం అనేది సఫారీల భయం. ఏదేమైనా వరుసగా మూడు వన్డేలు, అంతకన్నా ముందుగా ఓ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయి, తీవ్ర ఒత్తిడిలో వున్న సఫారీలు ఈ మ్యాచ్‌లో ఎంతవరకు రానిస్తారో వేచిచూడాల్సిందే మరి. 

Trending News