భారత్-పాక్ అభిమానులకు వసీం అక్రం సూచన !!

భారత్ పాక్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఇక వరల్డ్ కప్ మ్యాచ్ అంటే అది యుద్ధంతో సమానంగా చూస్తుంటారు.

Last Updated : Jun 15, 2019, 04:15 PM IST
భారత్-పాక్ అభిమానులకు వసీం అక్రం సూచన !!

వరల్డ్ కప్ పోరులో భాగంగా రేపు భారత్-పాకిస్తాన్ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. యుద్ధాన్ని తలిపించే ఈ పోరును తిలకించేందుకు ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా భారత్-పాక్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ ఇరుదేశాల అభిమానులకు ఓ సూచన చేశాడు...భారత్ -పాక్ మ్యాచ్ ను ఓ యుద్దంలా భావించవద్దని..ఇది ఆటగా మాత్రమే చూడాలని హితవు పలికాడు. 

ఆటను అభిమానులు ఎంజాయ్ చేయాలని..గెలుపోటములతో ఉద్వేగానికి లోనుకావద్దని వసీం సలహా ఇచ్చాడు. ఆట అన్నాక ఒక టీం గెలుస్తుంది..మరో టీం ఓడుతుంది. ఫలితంగా ఎలా ఉన్న గొప్పగా చూసుకోండి..అంతేకానీ ఇది యుద్ధంలా భావించవద్దు..అలా భావించే వాళ్లు అసలు క్రికెట్ అభిమానులు కాదని వసీం అక్రం అభిప్రాయపడ్డారు

భారత జట్టు గురించి వసీం మాట్లాడుతూ వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లులే భారత్ అతి బలమైన జట్టు..  కోహ్లీ సేన బ్యాటింగ్ బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ గా ఉంది.  కోహ్లీ సేనను ఎదుర్కొవడం పాక్ తో పాటు ఏ జట్టుకైన సవాలే.. రేపటి పాక్ మ్యాచ్ పాక్ జట్టుకు అతిపెద్ద సవాల్ గా మారనుందడంలో ఎలాంటి సందేశం లేదు. అయితే తనదైన రోజు ఎలాంటి పెద్ద జట్టుకైన మట్టికరిపించే సత్తా పాక్ లో ఉంది.. పాక్ ను తక్కవు అంచనా వేస్తే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కోహ్లీసేనకు వసీం అక్రం హెచ్చరించాడు.

Trending News