Sachin Tendulkar: కశ్మీర్‌లో గల్లీ క్రికెట్ ఆడిన సచిన్.. ట్రెండింగ్ లో వీడియో..

Sachin Tendulkar: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్యూల్కర్ ఫ్యామిలీతో కలిసి కశ్మీర్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2024, 01:55 PM IST
Sachin Tendulkar: కశ్మీర్‌లో గల్లీ క్రికెట్ ఆడిన సచిన్.. ట్రెండింగ్ లో వీడియో..

Sachin Tendulkar Kashmir tour: టీమిండియా లెజండరీ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్‌ (Sachin Tendulkar) తన కుటుంబంతో కలిసి కశ్మీర్‌ (Kashmir)లో పర్యటిస్తున్నాడు. ఈ సందర్భంగా గుల్‌మార్గ్‌లో స్థానికులతో కలిసి క్రికెట్ ఆడుతూ కనిపించాడు. చుట్టూ లోయల మధ్య రోడ్డుపై స్థానికులతో కలిసి ఎంతో ఉత్సాహంగా ఒక ఓవర్ బ్యాటింగ్ చేశాడు. తనను ఔట్ చేయాలని వారికి సచిన్ సవాల్ విసిరాడు. అయితే మాస్టర్ బ్లాస్టర్ వికెట్ తీయడంలో వారు విఫలమయ్యారు.  దీనికి సంబంధించిన వీడియోను సచిన్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో క్రికెట్ ఫ్యాన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. 

కశ్మీర్ టూర్ లో సచిన్ తాజాగా క్రికెట్ బ్యాట్‌ల తయారీ కేంద్రాన్ని సందర్శించాడు. కశ్మీర్‌లో మాత్రమే లభించే విల్లో చెట్టు టేకుతో తయారు చేసిన బ్యాట్లను ఆయన పరిశీలించారు. బ్యాట్ నాణ్యత, ఇతర అంశాలపై ఆరా తీశారు. . తన తొలి బ్యాట్ కశ్మీర్ విల్లోతో తయారు చేసిందేనని ఈ సందర్భంగా సచిన్‌ గుర్తు చేసుకున్నారు.  ఆ బ్యాట్‌ను తన సోదరి ఇచ్చినట్లు చెప్పాడు. జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖపై చివరి పాయింట్ అయిన అమన్ సేతు వంతెనను కూడా టెండూల్కర్ బుధవారం సందర్శించారు. అమన్ సేతు సమీపంలోని కమాండ్ పోస్ట్ వద్ద సైనికులతో సచిన్ సుమారు గంటపాటు ముచ్చటించారు. 

గత కొన్ని రోజులుగా సచిన్ తన భార్య అంజలి, కూతురు సారాతో కలిసి కాశ్మీర్ పర్యటనలో ఉన్నాడు. శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై చుర్సు వద్ద క్రికెట్ బ్యాట్ తయారీ కంపెనీని ఆయన సందర్శించారు. దక్షిణ కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌ పర్యాటక కేంద్రాన్ని కూడా సందర్శించారు. 50 ఏళ్ల ఈ వెటరన్ క్రికెటర్‌కు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. స్టేడియంకు ఎక్కడికి వెళ్లినా అభిమానులు సచిన్ సచిన్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన పట్ల గౌరవాన్ని చాటుకున్నారు.

Also Read: Yuvraj Singh: ఎంపీగా పోటీ చేయ‌నున్న‌ యువరాజ్ సింగ్.. ఏ పార్టీ నుంచంటే?

Also Read: Yashasvi Jaiswal: ముంబైలోని బాంద్రా ఏరియాలో ఫ్లాట్ కొన్న యశస్వి.. ధర తెలిస్తే షాక్ అవుతారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News