ICC T20 World Cup 2021: ప్రపంచ కప్ కోసం జట్లను ప్రకటించిన వెస్టిండీస్, శ్రీలంక, నమీబియా

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి వెస్టిండీస్, శ్రీలంక, నమీబియా క్రికెట్ జట్లు కూడా వారి స్కాడ్ లను ప్రకటించేశాయి.   డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీ20 వరల్డ్‌కప్ ఆడబోతున్న విండీస్ టీమ్‌లో స్టార్ ఆల్‌రౌండర్లు, భారీ హిట్టర్లకు చోటు దక్కింది

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2021, 03:15 PM IST
  • వచ్చే నెలలో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్ కప్
  • జట్లను ప్రకటించిన వెస్టిండీస్, శ్రీలంక, నమీబియా
  • కరేబియన్ జట్టులో సునీల్ నరైన్ కు దక్కని చోటు
ICC T20 World Cup 2021:  ప్రపంచ కప్ కోసం జట్లను ప్రకటించిన వెస్టిండీస్, శ్రీలంక, నమీబియా

ICC T20 World Cup 2021:  వచ్చే నెలలో జరగబోయే మెగాఈవెంట్ కోసం  క్రికెట్ జట్లన్నీ సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ 2021(ICC T20 World ?Cup 2021) కోసం వెస్టిండీస్, శ్రీలంక, నమీబియాలు తమ జట్లును ప్రకటించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్‌లో అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టీ 20 ప్రపంచ కప్‌ జరగనుంది.

వెస్టిండీస్ విషయానికొస్తే..

కిరన్ పోలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరించే వెస్టిండీస్ జట్టు(West Indies Team)లో రవి రాంపాల్, క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, ఆండ్రే రస్సెల్, నికోలస్ పూరన్, ఫ్యాబియన్ ఆలెన్ వంటి భారీ హిట్టర్లకు చోటు దక్కింది. అయితే సీనియర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌(Sunil Narine‌)కి మాత్రం టీ20 వరల్డ్‌కప్ 2021 జట్టులో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. రిజర్వు ప్లేయర్లుగా జాసన్ హోల్డర్, డారెన్ బ్రావో, హెల్డన్ కాంట్రెల్, ఏకెల్ హోసిన్‌లకు విండీస్ జట్టులో చోటు దక్కింది.

వెస్టిండీస్ జట్టు:  కిరన్ పోలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్, క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, ఫాబియన్ ఆలెన్, రోస్టర్ ఛేజ్, ఆండ్రే ఫ్లెచర్, హెట్మయర్, ఎడ్విన్ లూయిస్, మెక్‌య్, రవి రాంపాల్, ఆండ్రూ రస్సెల్, సిమన్స్, ఒసానో థామన్, హెడెన్ వాల్ష్ జూనియర్.

Also Read: Afghanistan Cricket: అఫ్గాన్‌ క్రికెట్ జట్టుకు గట్టి షాక్‌.. కెప్టెన్‌గా తప్పుకొన్న రషీద్‌ఖాన్‌

శ్రీలంక విషయానికొస్తే..

సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించలేకపోయిన శ్రీలంక జట్టు(Sri Lanka Team) కూడా టీ20 వరల్డ్‌కప్‌ 2021కి జట్టును ప్రకటించింది. జట్టుకు కెప్టెన్‌గా దాసున్ శనక(Dasun Shanaka)ను నియమించగా, జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన ధనంజయ్ డి సిల్వాను వైస్ కెప్టెన్‌గా నియమించారు. 21 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ మహిష్ తిక్షణ ప్రపంచకప్ కోసం జట్టులో చేరాడు. ఈ జట్టులో నోరిషన్ డిక్వెల్లా, కుశాల్ మెండిస్, ధనుష్క గుణతిలక  వంటి స్టార్ ప్లేయర్స్ కు చోటు దక్కలేదు. ఇంగ్లండ్‌లో కోవిడ్ ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు జూలైలో ఈ ముగ్గురిపై నిషేధించారు.

జట్టు: దాసున్ శనక (కెప్టెన్), ధనంజయ్ డి సిల్వా (వైస్-కెప్టెన్), కుశాల్ పెరీరా, దినేష్ చండీమల్, అవిశ్వక ఫెర్నాండో, బి. రాజపక్స, సి. అసలంగా, వనిందు హసరంగ, కమిందు మెండిస్, సి. కరుణరత్నే, ఎన్. ప్రదీప్, దుష్మంత చమీరా, పి. జయవిక్రమ, ఎల్. మధుశంక, ఎం. తేక్షణ.

రిజర్వ్ ప్లేయర్స్: లహిరు కుమార, బినూరు ఫెర్నాండో, అకిలా ధనంజయ, పులినా తరంగా

నమీబియా విషయానికొస్తే..

నమీబియా(Namibia) కూడా టీ20 వరల్డ్‌కప్ 2021(T20 World Cup 2021) టోర్నీ కోసం జట్టును ప్రకటించింది. మాజీ సౌతాఫ్రికా ప్లేయర్ డేవిడ్ వీస్‌కి నమీబియా జట్టులో చోటు దక్కడం విశేషం.

నమీబియా జట్టు: గ్రేహర్డ్ ఎరస్మస్ (కెప్టెన్), స్టెఫెన్ బార్డ్, కార్ల్ బిర్కెన్‌స్టాక్, మిచో డు ప్రీజ్, జాన్ ఫ్రేలింక్, జేన్ గ్రీన్, నికోల్ లోఫీ ఈటన్, బెనర్డ్ స్కాట్జ్, బెన్ సికాంగో, జేజే స్మిత్, రూబెన్ ట్రంపెల్‌మన్, మైకెల్ వాన్ లింగెన్, డేవిడ్ వీస్, క్రెగ్ విలియమ్స్, పీకీ యా ఫ్రాన్స్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News