Greg Chappell advice to Australian bowlers to tackle Shubman Gill: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023కి కౌంట్‌డౌన్ మొదలైంది. రెండో డబ్ల్యూటీసీ టైటిల్ కోసం ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. గత టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన భారత్.. ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు మొదటిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన ఆసీస్ కూడా కప్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. జట్లు పటిష్టంగా ఉండడంతో మ్యాచ్ అవకాశం ఉంది.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023లో పరుగుల వరద పారించిన భారత యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ మరో కీలక పోరుకు సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడేందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు. గతేడాది కాలంగా మూడు ఫార్మాట్లలోనూ రాణిస్తుండటంతో.. గిల్‌పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో గిల్ బ్యాటింగ్ తీరుపై ఆసీస్ క్రికెట్ దిగ్గజం గ్రెగ్ ఛాపెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫామ్ మీదున్న గిల్‌ను ఎలా ఆపాలో ఆసీస్ బౌలర్లకు సూచనలు చేశాడు. అదనపు పేస్‌తో బంతులను సందిస్తే ఇబ్బందిపడుతాడని ఛాపెల్ తెలిపాడు.
'శుభ్‌మన్ గిల్ ఆటను ఆస్ట్రేలియాలో చూశా. ఇలాంటి యువ క్రికెటర్లకు విదేశాల్లో ఆడేందుకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం భారత్ చేసిన అత్యుత్తమమైన పని. ఇతరు జట్లు కూడా దీనిని అనుసరించాలి. అప్పుడే ఓవర్సీస్ పిచ్‌ల గురించి వారికి అర్థమవుతుంది. గిల్‌కు తగినంత అనుభవం ఉంది. అయితే ఇంగ్లాండ్‌లో ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో కచ్చితంగా ఇబ్బంది పడతాడు. అదనపు పేస్‌తో బంతులను సంధిస్తే.. అతడికి కష్టాలు తప్పవు. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ లేదా బొలాండ్ లాంటి బౌలర్లు బౌన్స్‌తో బౌలింగ్ వేస్తే ఎంత మంచి బ్యాటర్ అయినా ఔట్ అవ్వాల్సిందే' అని గ్రెగ్ ఛాపెల్ అన్నాడు.
'ఆస్ట్రేలియా బౌలింగ్ గురించి ఎక్కువగా చెప్పను. శుభ్‌మన్ గిల్‌ను కట్టడి చేయడానికి ఆసీస్ బౌలర్లు కొన్ని విషయాపై దృష్టిసారించాలి. మరీ ముఖ్యంగా ఆఫ్ స్టంప్ మీదుగా అదనంగా బౌన్స్‌తో బంతులను సంధిస్తే.. గిల్ ఇబ్బంది పడే అవకాశం ఉంది. వికెట్ కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదు. ఆస్ట్రేలియా బౌలర్లు దీనిపై తప్పకుండా దృష్టిసారించాలి. ఒకవేళ బంతులు అదుపు తప్పితే మాత్రం గిల్ భారీ షాట్స్ ఆడుతాడు' అని గ్రెగ్ చాపెల్ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు 15 టెస్టులు ఆడిన గిల్.. రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలతో 890 పరుగులు చేశాడు.
Also Read: Hero HF Deluxe 2023: హీరో సరికొత్త 100సీసీ బైక్.. ధర 60 వేలు మాత్రమే! సూపర్ మైలేజ్
Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023.. మ్యాచ్ డ్రా అయితే ట్రోఫీ ఏ జట్టుదో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK.