Rains in Telangana: వెదర్ అలర్ట్... తెలంగాణలో నేటి నుంచి 5 రోజుల పాటు వర్షాలు...

Rains in Telangana: తెలంగాణకు నేటి నుంచి 5 రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2022, 08:19 AM IST
  • తెలంగాణలో వర్షాలు
  • సోమవారం నుంచి శుక్రవారం వరకు వర్ష సూచన
  • పలుచోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
Rains in Telangana: వెదర్ అలర్ట్... తెలంగాణలో నేటి నుంచి 5 రోజుల పాటు వర్షాలు...

Rains in Telangana: తెలంగాణలో సోమవారం (ఏప్రిల్ 18) నుంచి శుక్రవారం (ఏప్రిల్ 22) వరకు ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గంటకు 30 కి.మీ నుంచి 40కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. సముద్ర మట్టానికి 900 మీ. ఎత్తున ఉపరితల ద్రోణి ఆవరించినట్లు వెల్లడించింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం (ఏప్రిల్ 17) వర్షం కురిసింది. ఎండ వేడిమితో అల్లాడిపోతున్న జనాలకు వర్షాలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటిన సంగతి తెలిసిందే.

మరోవైపు, రైతన్నలు మాత్రం అకాల వర్షాలపై దిగులు చెందుతున్నారు. యాసంగి పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో ఎక్కడ పంట దెబ్బతింటుందోనని ఆందోళన చెందుతున్నారు. వర్ష సూచన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని చెబుతున్నారు.

Also Read: Umran Malik: నెట్ బౌలర్ నుంచి చరిత్ర సృష్టించిన బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్ ప్రస్థానం

Nandyala Road Accident: నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు అక్కడికక్కడే మృతి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News