సౌతాఫ్రికాపై టీమిండియా టార్గెట్ ఎంతంటే..

సౌతాంప్టన్: వన్డే ప్రపంచ కప్‌లో ఆరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే టీమిండియా బౌలర్లు దక్షిణ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టి వారెవ్వా అనిపించారు. దక్షిణాఫ్రికా జట్టు ఈ ప్రపంచ కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఇబ్బందులు పడిన తరహాలోనే ఈ మ్యాచ్‌లోనూ తిప్పలు పడింది.

Last Updated : Jun 5, 2019, 07:45 PM IST
సౌతాఫ్రికాపై టీమిండియా టార్గెట్ ఎంతంటే..

సౌతాంప్టన్: వన్డే ప్రపంచ కప్‌లో ఆరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే టీమిండియా బౌలర్లు దక్షిణ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టి వారెవ్వా అనిపించారు. దక్షిణాఫ్రికా జట్టు ఈ ప్రపంచ కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఇబ్బందులు పడిన తరహాలోనే ఈ మ్యాచ్‌లోనూ తిప్పలు పడింది. యుజువేంద్ర చాహల్(4/51), జస్ప్పిత్ బుమ్రా (2/35), భువనేశ్వర్ (2/44) తమ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో దక్షిణ ఆఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు మాత్రమే చేయగలిగింది. 
    
దక్షిణ ఆఫ్రికా బ్యాట్స్‌మేన్‌లో డుప్లెసిస్(38: 54 బంతుల్లో 4x4), వాన్ డర్ డుస్సెన్(22), డేవిడ్ మిల్లర్(31), ఫెలుక్వాయో(34) మాత్రమే కాస్తంత ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చగలిగారు. చివర్లో వచ్చిన క్రిస్‌మోరీస్(42), రబాడ (31 నాటౌట్) వేగంగా పరుగులు రాబట్టడంతో జట్టు స్కోర్ ఇంకాస్త పెరిగింది. దీంతో దక్షిణ ఆఫ్రికా మొత్తం స్కోర్ 227కు చేరింది.

Trending News